త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drugs | పంజాగుట్ట‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. పోలీసుల‌కు చిక్కిన ఐదుగురు విద్యార్థులు

P

Hyderabad | Published On Jan 25, 2026, 4.31 pm IST

Drugs | పంజాగుట్ట‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. పోలీసుల‌కు చిక్కిన ఐదుగురు విద్యార్థులు
Advertisement

Drugs | హైద‌రాబాద్ పంజాగుట్ట‌లో విద్యార్థులు డ్ర‌గ్స్ తీసుకుంటూ పోలీసుల‌కు చిక్కారు. నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారి నుంచి దాదాపు ప‌ది గ్రాముల ఎండీఎంఏ డ్ర‌గ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున స‌ర్కిల్ వ‌ద్ద ఐదుగురు అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారంతా ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు తేల్చారు. డ్ర‌గ్స్ ఎక్క‌డి నుంచి తీసుకువ‌చ్చారు? ఎక్క‌డి నుంచి స‌ర‌ఫ‌రా జ‌రుగుతుందో పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థులు డ్ర‌గ్స్‌తో ప‌ట్టుబ‌డ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement