Hyderabad Police | సికింద్రాబాద్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. పలువురిపై కేసులు నమోదు..
Hyderabad Police | హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ జోన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ధూమపానం చేయడం తదితర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 38 ప్రత్యేక పోలీస్ బృందాలు పాల్గొన్నాయి. జోన్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ పార్కులు, స్మశాన వాటికలు, వైన్ షాపుల పరిసరాలు, జనావాసాలు లేని ప్రాంతాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో గంజాయి సేవిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న 28 మందిని, మద్యం సేవిస్తున్న 81 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరికీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రజలకు అసౌకర్యం కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి మాట్లాడుతూ బహిరంగ మద్యపానం, ధూమపానం, గంజాయి సేవనం అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు భవిష్యత్తులో కూడా ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ డ్రైవ్‌లో జోన్ పరిధిలోని ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






