త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramzan Festival | రాష్ట్రంలో రంజాన్ సంద‌డి..ఉద‌యం 5 వ‌ర‌కు షాపులు ఓపెన్..!

Ramzan Festival | రాష్ట్రంలో రంజాన్ సంద‌డి మొద‌లైంది. రంజాన్ మాసం నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ల‌కు ప్ర‌త్యేక మిన‌హాయింపులు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Hyderabad | Published On Feb 18, 2026, 4.57 pm IST

Ramzan Festival | రాష్ట్రంలో రంజాన్ సంద‌డి..ఉద‌యం 5 వ‌ర‌కు షాపులు ఓపెన్..!
Advertisement

Ramzan Festival | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో రంజాన్ సంద‌డి మొద‌లైంది. రంజాన్ మాసం నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ల‌కు ప్ర‌త్యేక మిన‌హాయింపులు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 20వ తేదీ వ‌ర‌కు ఈ మిన‌హాయింపులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ప్ర‌తి రోజు తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు షాపులు తెరిచి ఉంచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది.

తెలంగాణ షాప్స్, ఎస్టాబ్లిష్‌మెంట్ చ‌ట్టం 1988 ప్ర‌కారం.. రోజుకి 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేసినపుడు ఆ ఉద్యోగులు, కార్మికులకు సాధారణ వేతనంతో పాటు ఓవర్ టైం వేతనాలు చెల్లించాలని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సెలవు దినాల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రత్యామ్నాయ సెలవు దినం మంజూరు చేయాలని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు రాత్రి సమయంలో పని చేయడానికి అనుమతి ఉందని కూడా స్పష్టం చేశారు. 24 గంటలూ షాపులు ఓపెన్‌ చేయాలనుకునే యాజమానులు సంబంధిత అధికారుల దగ్గర రశీదులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement