త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Model School Students | విహార యాత్ర‌కు మోడ‌ల్ స్కూల్ విద్యార్థులు.. రోడ్డు ప్ర‌మాదంలో 26 మందికి గాయాలు

Model School Students | తోటి మిత్రుల‌తో క‌లిసి ఎంతో ఉత్సాహంగా విహార యాత్ర‌కు వెళ్లిన మోడ‌ల్ స్కూల్ విద్యార్థులకు (Model School Students) విషాదం ఎదురైంది. టూర్‌నును ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సులు ప్ర‌మాదానికి (Road Accident) గుర‌య్యాయి.

G

Telangana | Published On Jan 21, 2026, 8.46 am IST

Model School Students | విహార యాత్ర‌కు మోడ‌ల్ స్కూల్ విద్యార్థులు.. రోడ్డు ప్ర‌మాదంలో 26 మందికి గాయాలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తోటి మిత్రుల‌తో క‌లిసి ఎంతో ఉత్సాహంగా విహార యాత్ర‌కు వెళ్లిన మోడ‌ల్ స్కూల్ విద్యార్థులకు (Model School Students) విషాదం ఎదురైంది. టూర్‌నును ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సులు ప్ర‌మాదానికి (Road Accident) గుర‌య్యాయి. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో 26 మంది గాయ‌ప‌డ్డారు.

న‌ల్ల‌గొండ జిల్లా డిండి స‌మీపంలోని గుండ్ల‌ప‌ల్లి మోడ‌ల్ స్కూల్‌, కాలేజీకి చెందిన 9, 10 త‌రగ‌తి, ఇంట‌ర్ విద్యార్థులు మూడు రోజుల క్రితం విహార యాత్ర‌కు బ‌య‌ల్దేరారు. 40 మంది బాలిక‌లు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది రెండు బ‌స్సుల్లో అర‌కు, పాడేరు స‌మీప ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. తిరుగు ప్ర‌యాణంలో అన్న‌వ‌రం స‌త్య‌దేవుణ్ణి ద‌ర్శించుకుని మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటాక రాజ‌మండ్రి వైపు వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలో దివాన్ చెరువు వ‌ద్ద ఓ బర్రె అడ్డురావ‌డంతో ముందు వెళ్తున్న ట్రావెల్స్ బ‌స్సు డ్రైవ‌ర్ ఒక్క‌సారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వ‌స్తున్న విద్యార్థుల బ‌స్సులు రెండు, మ‌రో ట్రావెల్స్ బ‌స్సు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో రెండు బ‌స్సుల్లో 26 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ద‌వాఖాన‌కు, మిగిలినవారిని దివాన్‌చెరువులోని బాలవికాస్‌ మందిరానికి తరలించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement