త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Safe Rides | రాంనగర్, బేగంబజార్‌లో కుళ్లిన చేపలు.. టీజీ సేఫ్ దాడుల్లో బ‌య‌టప‌డ్డ‌ షాకింగ్ నిజాలు.. ఇంకా ఎక్క‌డెక్క‌డ గుర్తించారంటే!

TG Safe Rides | హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలో చేప‌లు తినే ప్రియుల‌కు షాకింగ్ న్యూస్ ఇది. చేప‌ల మార్కెట్ల‌కు పెట్టింది పేరైన రాంన‌గ‌ర్‌, బేగంబ‌జార్‌ల‌లో శుక్ర‌వారం టీజీ సేఫ్ (TG Safe) జ‌రిపిన‌ దాడు(Rides)ల్లో ప‌లు దుకాణాల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

S

Hyderabad | Published On Nov 27, 2026, 3.19 pm IST

TG Safe Rides | రాంనగర్, బేగంబజార్‌లో కుళ్లిన చేపలు.. టీజీ సేఫ్ దాడుల్లో బ‌య‌టప‌డ్డ‌ షాకింగ్ నిజాలు.. ఇంకా ఎక్క‌డెక్క‌డ గుర్తించారంటే!
Advertisement

TG Safe Rides | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలో చేప‌లు తినే ప్రియుల‌కు షాకింగ్ న్యూస్ ఇది. చేప‌ల మార్కెట్ల‌కు పెట్టింది పేరైన రాంన‌గ‌ర్‌, బేగంబ‌జార్‌ల‌లో శుక్ర‌వారం టీజీ సేఫ్ (TG Safe) జ‌రిపిన‌ దాడు(Rides)ల్లో ప‌లు దుకాణాల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వెటర్నరీ అధికారులతో కలిసి బేగంబజార్, రాంనగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లోని మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన చేప‌లు గుర్తించిన అధికారులు దుకాణాలు మూసివేసేందుకు నోటీసులు (Notices) జారీ చేశారు. తిన‌డానికి అస‌లే ప‌నికిరాకుండా ఉన్న చేపలను పెద్ద ఎత్తున గుర్తించి అక్కడికక్కడే పారబోశారు.

ఆ వ్యాపార సంస్థ‌ల‌కు నోటీసులు

బేగంబజార్‌లోని జీఎన్‌బీ శ్రీ శ్రీనివాస ఫిష్ మర్చంట్‌ దుకాణంలో సుమారు 70 కిలోల కుళ్లిన బొచ్చె (కట్ల) చేపలను అధికారులు తొలగించారు. రాంనగర్‌లోని బిన్సన్స్ ఫిషరీలో 65 కిలోలు, ముషీరాబాద్‌లోని జీబీకే ఫిషరీస్‌లో 30 కిలోలు, ఎస్వీఆర్ షాపులో 35 కిలోల తిలాపియా చేపలతో పాటు ఇతర దుకాణాల్లో అపరిశుభ్రంగా నిల్వ ఉంచిన చేపలను గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన రాంనగర్‌లోని రెండు వ్యాపార సంస్థలకు అధికారులు క్లోజర్ నోటీసులు అంద‌జేశారు.

ఫార్మాలిన్‌, నైట్రేట్ వంటి హానిక‌ర ర‌సాయ‌నాలు

అయితే చేపలు ఎక్కువ రోజులు తాజాగా కనిపించేందుకు వ్యాపారులు ఫార్మాలిన్, నైట్రేట్ వంటి హానికర రసాయనాలను వాడుతున్నారా అనే అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. దీంతో ఈ కోణంలోనే అధికారులు ప్రాథమిక పరీక్షలకు పూనుకున్నారు. చేపల నమూనాలను సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. తప్పనిసరిగా ఉండాల్సిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో విక్రయాలు సాగిస్తున్న పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు.

Advertisement
Advertisement