త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | రానున్న 2 గంటల్లో హైద‌రాబాద్‌లో వ‌ర్షం..!

Rain Alert | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం నుంచి ఆకాశం మేఘావృత‌మై ఉంది. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు కాస్త స్వ‌ల్పంగానే ఉన్నాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌డంతో ఎండ‌తో పాటు ఉక్క‌పోత నుంచి న‌గ‌ర ప్ర‌జ‌లు ఉప‌శ‌మ‌నం పొందారు.

S

Hyderabad | Published On Mar 22, 2026, 3.27 pm IST

Rain Alert | రానున్న 2 గంటల్లో హైద‌రాబాద్‌లో వ‌ర్షం..!
Advertisement
Rain Alert | త్రినేత్ర‌.న్యూస్ :  రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం నుంచి ఆకాశం మేఘావృత‌మై ఉంది. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు కాస్త స్వ‌ల్పంగానే ఉన్నాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌డంతో ఎండ‌తో పాటు ఉక్క‌పోత నుంచి న‌గ‌ర ప్ర‌జ‌లు ఉప‌శ‌మ‌నం పొందారు. అయితే మ‌రో రెండు గంట‌ల్లో హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌తో పాటు ములుగు, మ‌హ‌బూబాబాద్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, జ‌న‌గాం, న‌ల్ల‌గొండ జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ హెచ్చ‌రించారు. ఈ జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.
ఇక హైద‌రాబాద్ న‌గ‌రం విష‌యానికి వ‌స్తే సిటీ శివారు ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. హ‌య‌త్ న‌గ‌ర్, వ‌న‌స్థలిపురం, బీఎన్ రెడ్డి, ఇబ్ర‌హీపట్నంతో పాటు స‌మీప ప్రాంతాల్లో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇత‌ర ప్రాంతాల్లో పొడి వాతావ‌ర‌ణం ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు.
Advertisement

తాజావార్తలు

Advertisement