త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rail Parcel Logistics | ‘రైల్ పార్శిల్ లాజిస్టిక్’ యాప్ ప్రారంభించిన ద‌క్ష‌ణి మ‌ధ్య రైల్వే

Rail Parcel Logistics | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే మ‌రో ముందడుగు వేసింది. స‌రుకు ర‌వాణాను త‌ర‌లించేందుకు స‌రికొత్త‌గా రైల్ పార్శిల్ లాజిస్టిక్స్ యాప్‌ను ప్రారంభించింది.

S

Hyderabad | Published On Feb 26, 2026, 6.38 am IST

Rail Parcel Logistics | ‘రైల్ పార్శిల్ లాజిస్టిక్’ యాప్ ప్రారంభించిన ద‌క్ష‌ణి మ‌ధ్య రైల్వే
Advertisement

Rail Parcel Logistics | త్రినేత్ర‌.న్యూస్ : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే మ‌రో ముందడుగు వేసింది. స‌రుకు ర‌వాణాను త‌ర‌లించేందుకు స‌రికొత్త‌గా రైల్ పార్శిల్ లాజిస్టిక్స్ యాప్‌ను ప్రారంభించింది. బుధ‌వారం రైల్ నిల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఈ యాప్‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ సంజ‌య్ కుమార్ శ్రీవాత్స‌వ ఆవిష్క‌రించారు.

ఈ యాప్ డోర్‌స్టెప్ పికప్, డెలివరీతో సహా ఎండ్-టు-ఎండ్ పార్శిల్ బుకింగ్ సేవలను అందిస్తుంది. క‌స్ట‌మ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ స‌రుకుల‌ను ట్రాక్ చేసుకునేందుకు వీలు క‌ల్పించారు. డిజిట‌ల్ రూపంలోనే చెల్లింపులు కూడా చేసుకోవ‌చ్చు. పార‌ద‌ర్శ‌కంగా సేవ‌ల‌ను అందిస్తుంది. అంతేకాకుండా ప్లాట్‌ఫామ్ లాజిస్టిక్స్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ఛార్జీలు, రేటింగ్‌ల‌ను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. పైల‌ట్ ప్రాజెక్టు కింద మొద‌ట‌గా హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌, గుంటూరు, రాజ‌మండ్రి, విశాఖ‌ప‌ట్నం, బెంగ‌ళూరు, చెన్నైతో స‌హా ఏడు న‌గ‌రాల‌ను క‌వ‌ర్ చేస్తుంద‌ని శ్రీవాత్స‌వ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement