Rachakonda | డ్రగ్స్ వినియోగంపై ఉక్కు పాదం మోపుతాం : రాచకొండ సీపీ
Rachakonda | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి బుధవారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Rachakonda | త్రినేత్ర.న్యూస్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి బుధవారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పరిధిలోని డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్‌గా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వేడుకలలో ప్రజలు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని, కాబట్టి శాంతి భద్రతల సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్, ఎస్ఓటి, షి టీమ్స్, పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాలు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు, నేరాలు జరగకుండా విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని, ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్‌లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి తమ షి టీమ్ బృందాలు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తారని, నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని ఈ సందర్బంగా కమిషనర్ పేర్కొన్నారు.
పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు చేయాలని, షాపులు, పబ్‌లు, రెస్టారెంట్‌ల పరిసరాల్లో సీసీటీవీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగర శివార్లలో ఉండే ఫామ్ హౌస్‌లలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలని, ఎటువంటి డ్రగ్స్ వినియోగం జరగకూడదని, మహిళలతో అసభ్యకర డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదని పేర్కొన్నారు.
రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా మరియు ఎటువంటి బైక్ రేసులు చేయకుండా ఉండేందుకు నిర్దేశిత సమయం పాటు తాత్కాలికంగా ఫ్లై ఓవర్ లను మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, ఎల్‌బి నగర్ డీసీపీ అనురాధ, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, యాదాద్రి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఎస్ఓటి డీసీపీ రమణ రెడ్డి, డీసీపీ అడ్మిన్ ఇందిర, ఎస్బి డీసీపీ జి నరసింహారెడ్డి, విమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా రాణి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





