త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalasani Srinivas Yadav | కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు: త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్

Thalasani Srinivas Yadav | ఆరు గ్యారెంటీ ల హామీల పేరుతో అధికారంలోకి వచ్చి న తర్వాత ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ను ప్ర‌జ‌లు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికే పదవులు ద‌క్కుతాయని స్ప‌ష్టం చేశారు.

S

Hyderabad | Published On May 24, 2026, 3.06 pm IST

Thalasani Srinivas Yadav | కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు: త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Thalasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: ఆరు గ్యారెంటీ ల హామీల పేరుతో అధికారంలోకి వచ్చి న తర్వాత ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ను ప్ర‌జ‌లు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్ల‌ను తుడిపేసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉందా అని ప్ర‌శ్నించారు. ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ కార్య‌క‌ర్త‌ల‌ సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఓవైపు కాంగ్రెస్‌పై విమ‌ర్శలు చేస్తూనే మ‌రోవైపు రాష్ట్ర సాధ‌న‌లో కేసీఆర్ కృషిని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచే విధంగా బీఆర్ఎస్‌ ప్రభుత్వం పని చేసింది. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏ సమస్య ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తల వద్దకే వస్తారు. అది పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపు. తల్లి లాంటి పార్టీని కాపాడుకోవాలి. పార్టీ కోసం పని చేసే వారికే పదవులు ద‌క్కుతాయి అని త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement