త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | భార‌తీయుల‌ను కాపాడండి.. జైశంక‌ర్‌కు అస‌దుద్దీన్ ఒవైసీ రిక్వెస్ట్‌

Asaduddin Owaisi | మ‌య‌న్మార్‌-థాయిలాండ్ స‌రిహ‌ద్దులో బానిస‌న‌లుగా మ‌గ్గుతున్న భార‌తీయుల‌ను కాపాడాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌కు ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ విజ్ఞ‌ప్తి చేశారు.

P

Hyderabad | Published On Jan 22, 2026, 5.49 pm IST

Asaduddin Owaisi | భార‌తీయుల‌ను కాపాడండి.. జైశంక‌ర్‌కు అస‌దుద్దీన్ ఒవైసీ రిక్వెస్ట్‌
Advertisement

Asaduddin Owaisi | మ‌య‌న్మార్‌-థాయిలాండ్ స‌రిహ‌ద్దులో బానిస‌న‌లుగా మ‌గ్గుతున్న భార‌తీయుల‌ను కాపాడాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌కు ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ విజ్ఞ‌ప్తి చేశారు. 16 మంది భార‌తీయుల‌ను ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి న‌మ్మించి మోసం చేశార‌ని.. వారిని మ‌య‌న్మార్-థాయిలాండ్ స‌రిహ‌ద్దుల్లో బానిస‌లుగా మ‌గ్గుతున్నార‌ని పేర్కొన్నారు. ఇందులో హైద‌రాబాద్‌కు చెందిన ముగ్గురు ఉన్నార‌ని తెలిపారు. ఉస్మాన‌గ‌ర్‌కు చెందిన మీర్ స‌జ్జాద్ అలీతో పాటు మౌలాలీ, బంజారాహిల్స్‌కు చెందిన మ‌రో ఇద్ద‌రు ఉన్నార‌న్నారు. ప్ర‌తిరోజూ వారితో 18-20 గంట‌ల ప‌ని చేస్తున్నార‌ని, శారీర‌కంగా హింసిస్తున్నార‌ని.. పాస్‌పోర్టులు, ఫోన్లు లాక్కున్నార‌ని, వైద్య స‌దుపాయం కూడా లేద‌న్నారు. ఈ విష‌యంలో జోక్యం చేసుకొని కాపాడాల‌ని కేంద్ర‌మంత్రిని అస‌దుద్దీన్ కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement