త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University | ఓయూలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థి.. ప‌రిస్థితి విష‌మం

Osmania University | ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో (Osmania University) ఓ విద్యార్థి ఆత్మ‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. మ‌హ‌బూబాబాద్‌ జిల్లాకు చెందిన వినీశ్ అనే విద్యార్థి ఓయూలో మైనింగ్ ఇంజినీరింగ్ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతున్నాడు.

G

Hyderabad | Published On Apr 27, 2026, 12.51 pm IST

Osmania University | ఓయూలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థి.. ప‌రిస్థితి విష‌మం
Advertisement

Osmania University | త్రినేత్ర‌.న్యూస్‌: ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో (Osmania University) ఓ విద్యార్థి ఆత్మ‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. మ‌హ‌బూబాబాద్‌ జిల్లాకు చెందిన వినీశ్ అనే విద్యార్థి ఓయూలో మైనింగ్ ఇంజినీరింగ్ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతున్నాడు. సోమ‌వారం ఉద‌యం క్యాంప‌స్‌లోని లేడీస్ హాస్ట‌ల్ ఎదురుగా ఉన్న రేణుకా ఎల్ల‌మ్మ ఆల‌యం వ‌ద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంట‌ల‌కు తాళ‌లేక ఆర్త‌నాదాలు చేశాడు. గ‌మ‌నించిన తోటి విద్యార్థులు మంట‌ల‌ను ఆర్పివేశారు.

వ‌ర్సిటీ హుటాహుటిన అత‌డిని సికింగ్రాబాద్‌లోని గాంధీ ద‌వాఖాన‌కు (Gandhi Hospital) త‌ర‌లించారు. కాగా, వినీశ్ 70 శాతానికిపైగా కాలిపోయిన‌ట్లుగా వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఐసీయూలో నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని చెప్పారు. వినీశ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. అయితే ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement