త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Job Mela at OU | 16న ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జాబ్ మేళా..!

Job Mela at OU | ఉస్మానియా యూనివ‌ర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో స‌హ‌కారంతో అక్ష‌ర ఎంట‌ర్‌ప్రైజెస్ బెంగ‌ళూరు ఆధ్వ‌ర్యంలో ఈ నెల 16న  జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్నారు.

S

Telangana | Published On May 11, 2026, 1.11 pm IST

Job Mela at OU | 16న ఉస్మానియా యూనివ‌ర్సిటీలో జాబ్ మేళా..!
Advertisement

Job Mela at OU | త్రినేత్ర‌.న్యూస్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో స‌హ‌కారంతో అక్ష‌ర ఎంట‌ర్‌ప్రైజెస్ బెంగ‌ళూరు ఆధ్వ‌ర్యంలో ఈ నెల 16న  జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్నారు. ఆర్ట్స్ క‌ళాశాల‌కు ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూర్ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. హైద‌రాబాద్‌లోని సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల‌కు చెందిన 15 పోస్టుల‌ను ఈ జాబ్ మేళా ద్వారా అక్ష‌ర ఎంట‌ర్‌ప్రైజెస్ భ‌ర్తీ చేయ‌నుంది.

అర్హులు వీరే..

MBA/BBA/M.Com/B.Com లో ఉత్తీర్ణ‌త సాధించిన ప‌ట్ట‌భ‌ద్రులు ఈ పోస్టుల‌కు అర్హులు. అర్హులైన అభ్య‌ర్థులు విద్యార్హ‌త‌ల‌తో కూడిన జిరాక్స్ ప‌త్రాల‌ను వెంట తెచ్చుకోవాలి.

వ‌య‌సు

18 నుంచి 35 సంవ‌త్స‌రాలు

జీతం

ఏడాదికి రూ. 4 ల‌క్ష‌ల ప్యాకేజీ

త‌దిత‌ర వివ‌రాల కోసం హెచ్ఆర్ శ్రేయాస్ (Ph.No. 9343601037) ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement