Robbery | పనిచేస్తున్న ఇంటికే కన్నం.. జూబ్లీహిల్స్‌లో నేపాలీ దంపతుల భారీ చోరీ
obbery | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ (Nepali Gang) రెచ్చిపోతున్నారు. ఉపాధి కోసం ఇండ్లలో పనికిచేరుతున్న నేపాలీలు.. అదనుచూసి అందినకాడికి (Robbery) దోచుకుపోతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని (Jubilee Hills) ఓ ఇంట్లో రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు చోరీ చేశారు.
Robbery | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ (Nepali Gang) రెచ్చిపోతున్నారు. ఉపాధి కోసం ఇండ్లలో పనికిచేరుతున్న నేపాలీలు.. అదనుచూసి అందినకాడికి (Robbery) దోచుకుపోతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని (Jubilee Hills) ఓ ఇంట్లో రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నేపాల్‌కు చెందిన మహేశ్ షాయి, అప్సర దంపతులు 45 రోజుక్రితం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 25లోని ప్లాట్ నంబర్ 305లో పింగళి అనురుద్‌రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో పనికిచేరారు. శుక్రవారం మధ్యాహ్నం భార్య దీపికారెడ్డితో కలిసి ఊటీకి వెళ్లారు. అయితే పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు.. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు.. వంటి వాటిపై రెక్కీ నిర్వహించారు. అదనుకోసం చూస్తున్న వారికి అనిరుద్ దంపతులు ఊరికి వెళ్లడంతో అవకాశాన్ని వినియోగించుకున్నారు.
ఇంటి తాళాలు పగులగొట్టి 8 డైమండ్ నెక్లెస్‌లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగను బ్యాగ్‌లో సర్దుకుని ఉడాయించారు. ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్ గమనించి యజమానికి విషయం చెప్పాడు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





