వరదొచ్చినా అంబర్‌పేట్-మూసారాంబాగ్ మధ్య జర్నీ ఇక ఈజీ..! హైలెవెల్ వంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్
Mussarambagh Bridge | మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన కొత్త హైలెవెల్ వంతెన ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి వంతెనను ప్రారంభించారు. దీంతో అంబర్‌పేట్–మూసారాంబాగ్ మధ్య రాకపోకలకు మార్గం సుగమమైంది.
Mussarambagh Bridge | మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన కొత్త హైలెవెల్ వంతెన ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి వంతెనను ప్రారంభించారు. దీంతో అంబర్‌పేట్–మూసారాంబాగ్ మధ్య రాకపోకలకు మార్గం సుగమమైంది. మూసారాంబాగ్ ప్రాంతంలో మూసీపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 2022లో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సుమారు రూ.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులు పూర్తయ్యాయి. మొత్తం 400 మీటర్ల పొడవున నిర్మించిన వంతెన 14.5 మీటర్ల వెడల్పుతో ఉంది.
పాదచారుల సౌకర్యార్థం 3.5 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక ఫుట్‌పాత్‌ను కూడా ఏర్పాటు చేశారు. వంతెన అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్ ప్రాంతాల మధ్య ప్రయాణం ఏడాది పొడవునా సులభతరం కానుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మూసీకి వరద నీరు చేరిన సమయంలో రాకపోకలకు తలెత్తే ఇబ్బందులకు ఈ వంతెన శాశ్వత పరిష్కారం చూపనుంది. ఇప్పటివరకు వర్షాలు, వరదల సమయంలో ఈ మార్గంలో ప్రయాణికులు ఎదుర్కొన్న అంతరాయాలు తగ్గడంతో పాటు, రెండు ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. వాహనదారులతో పాటు పాదచారులకు కూడా సురక్షితమైన, నిరంతరాయమైన ప్రయాణ సౌకర్యం కలగనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
- ●గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!
- ●Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్
- ●Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం
- ●RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి
- ●SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య

గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!

Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్

Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం





