Ramchandar Rao | మళ్లొక్కసారి దాడి చేస్తే.. మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనివ్వం: రాంచందర్‌రావు
Ramchandar Rao | జంతర్ మంతర్‌లో, బిహార్‌లో ఎప్పుడో ప్రొటెస్ట్ జరిగితే ఇప్పుడు దాడి చేయడం ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు. NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద దాడి చేయడం అవివేకమైన చర్యగా అభివర్ణించారు.
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: జంతర్ మంతర్‌లో, బిహార్‌లో ఎప్పుడో ప్రొటెస్ట్ జరిగితే ఇప్పుడు దాడి చేయడం ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు. NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద దాడి చేయడం అవివేకమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తలను డైవర్ట్ చేయడానికి పార్టీ స్టేట్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నాయకులు నల్ల పెయింట్ వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏం చేయాలనుకుంటుందని.. యువతను ఎటువైపు తీసుకెళ్తున్నారని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై సోమవారం జరిగిన దాడి అనంతరం ఆయన పలు మీడియా చానళ్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఎవరికి పెల్లెట్ గన్ బులెట్స్ తగిలాయి? అమిత్‌షాను రాజీనామా చేయమంటున్నారు.. అమిత్‌షాకు సంబంధం ఏంటి? రాహుల్ గాంధీ ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మాట్లాడాలి. రాహుల్ గాంధీకి బుద్ధి లేదనుకుంటే.. లోకల్‌గా మీకైనా బుద్ధి ఉండాలి కదా? మేం తలుచుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరు. NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసులు, నాయకుల ఇళ్లు, కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోం. మేం జవాబిస్తే మీరు రాష్ట్రంలో రోడ్ల మీద కూడా తిరగలేరు అని రాంచందర్ రావు హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



