MLC Teenmar Mallanna | అధిక ఫీజుల దోపిడీ.. రంగంలోకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
MLC Teenmar Mallanna | ఉప్పల్ పరిధిలోని సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు.
MLC Teenmar Mallanna | త్రినేత్ర.న్యూస్ : ఉప్పల్ పరిధిలోని సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. అడ్మిషన్ సమయంలో ప్రతి సంవత్సరం కేవలం 5 శాతం వరకు మాత్రమే ఫీజులు పెంచుతామని హామీ ఇచ్చిన పాఠశాల యాజమాన్యం, ప్రస్తుతం 25 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై గత కొద్ది రోజులుగా పాఠశాల ఎదుట తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నారు. బాధిత తల్లిదండ్రులు ఎమ్మెల్సీ మల్లన్నను సంప్రదించడంతో ఆయన వెంటనే స్పందించి పాఠశాలకు వెళ్లి యాజమాన్యంతో ప్రత్యక్షంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, నియంత్రణ లేకుండా ఫీజులు పెంచడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం తగదని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు సామాజిక బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని సూచించారు. అడ్డగోలుగా ఫీజులు పెంచి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నిస్తే సహించబోమని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. వెంటనే సమస్యను పరిష్కరించి, న్యాయమైన ఫీజు విధానం అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. తల్లిదండ్రుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు తాను అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ మల్లన్న హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారిమళ్లింపు
మే 6, 2026

Uppal Junction | ఉప్పల్ చౌరస్తా బంద్.. వాహనదారులు ఎలా వెళ్లాలంటే?
ఏప్రిల్ 26, 2026

Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మధ్యాహ్నం 12 తర్వాత అటువైపు వెళ్లారో ఇక అంతే!
ఏప్రిల్ 13, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



