Hyderabad | ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య.. ఇది మైనర్ల ప్రేమకథ..!
Hyderabad | ఆమెకు 16 ఏండ్లు.. అతనికి 20 ఏండ్లు.. నాలుగు నెలల క్రితం ప్రేమలో పడ్డారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ మైనర్ల ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. క్షణికావేశంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఆమెకు 16 ఏండ్లు.. అతనికి 20 ఏండ్లు.. నాలుగు నెలల క్రితం ప్రేమలో పడ్డారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ మైనర్ల ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. క్షణికావేశంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మైనర్ల నాలుగు నెలల ప్రేమకథ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నిపింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి గ్రామానికి చెందిన 16 ఏండ్ల బాలికకు సిద్ధగోని మహేశ్(20)తో నాలుగు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాలుగు నెలల్లోనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమికులిద్దరూ నెల రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే సోమవారం రోజుకు బాలికకు మహేశ్ ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో మానసిక వేదనకు గురైన బాలిక.. మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. ప్రియురాలి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా దారుణానికి ఒడిగట్టాడు.
హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రహ్మణపల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మహేశ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు రక్షించేందుకు యత్నించినప్పటికీ, అప్పటికే తీవ్రమైన కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





