త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar babu | జీహెచ్ఎంసీ అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు : మంత్రి శ్రీధ‌ర్ బాబు

Sridhar babu | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల నిధులు మంజూరు చేశామ‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు శాస‌న‌స‌భా వేదిక‌గా స్ప‌ష్టం చేశారు.

S

Hyderabad | Published On Mar 24, 2026, 12.38 pm IST

Sridhar babu | జీహెచ్ఎంసీ అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు : మంత్రి శ్రీధ‌ర్ బాబు
Advertisement

Sridhar babu | త్రినేత్ర‌.న్యూస్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల నిధులు మంజూరు చేశామ‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు శాస‌న‌స‌భా వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారుల మౌలిక స‌దుపాయాల‌పై బీఆర్ఎస్ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి శ్రీధ‌ర్ బాబు స‌మాధానం ఇచ్చారు.

మున్సిపల్‌శాఖ అభివృద్ధికి సంబంధించి.. సీఎం ఓ ప్రణాళికను తీసుకున్నారు. జీహెచ్ఎంసీ అభివృద్ధికి మేం రూ. 15 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే రూ.122 కోట్ల మాత్రమే ఖర్చు చేశారని ఎమ్మెల్యేలు చెప్పారు. 2016లో ఎస్‌ఆర్‌డీపీని తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెుదలుపెట్టిన పనులకు మేము నిధులు మంజూరు చేశాం. ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేస్తున్నాం. 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం. అభివృద్ధి పనులకు ప్రణాళిక ప్రకారంగా నిధులు మంజూరు చేస్తున్నాం. లింక్‌రోడ్లకు సంబంధించి మేము ప్రస్తావిస్తున్నాం. కోటీశ్వరులే కాకుండా సామాన్యులూ నివసించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ అభివృద్ధి ఎలా చేయాలో ప్రణాళిక రూపొందిద్దాం అని మంత్రి శ్రీధ‌ర్ బాబు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement