త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు

Drunk and Drive Cases | సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వీకెండ్ స్పెష‌ల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కేసులు పెరుగుతనే ఉన్న‌య్‌. పోయిన వారం 97 కేసులు కొట్టేయగా.. ఈవారం త‌నిఖీల్లో మందు బాబులు ప‌ట్టుబ‌డ‌గా 265 కేసులు బుక్ చేశారు.

S

Hyderabad | Published On Oct 11, 2026, 1.46 pm IST

Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు
Advertisement

Drunk and Drive Cases | త్రినేత్ర న్యూస్: సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వీకెండ్ స్పెష‌ల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కేసులు పెరుగుతనే ఉన్న‌య్‌. పోయిన వారం 97 కేసులు కొట్టేయగా.. ఈవారం త‌నిఖీల్లో మందు బాబులు ప‌ట్టుబ‌డ‌గా 265 కేసులు బుక్ చేశారు. 237 ద్విచక్ర వాహనదారులు, 5 ఆటోలు, 20 కార్లు, 3 హెవీ వాహనదారులపై కేసులు నమోదు చేసిన‌ట్లు సైబ‌రాబాద్ పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు.

219 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 26 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 20 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్‌ సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం నేరమని సైబరాబాద్‌ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్‌ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు.

గత వారం (5.10.2026 నుంచి 10.10.2026)లో 97 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయ‌ని.. ఆరుగురికి జరిమానా, సోషల్‌ సర్వీస్, 91 మందికి జరిమానా విధించిన‌ట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement