Ponnam Prabhakar | ఒక్క ఓటు పోలేదంటున్నవ్.. టైమిస్తే అందర్ని తోల్కొనొస్తా
Ponnam Prabhakar | ఒక్క ఓటు పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు (Ramchandar Rao) అంటున్నారని.. డేట్, టైమిస్తే ఓటు బాధితులందర్నీ తోల్కొనొస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
- తప్పిచ్చుకొని పోకు.. రికార్డులన్నీ చెక్ చేద్దాం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
- పోలీస్ ఫోర్స్ పెట్టుకొని అరెస్టులేంది?
- నా ఓటును తీసేందుకు ట్రై చేసిర్రు
- ఇప్పటికైనా కనీస జ్ఞానం తెచ్చుకోండి
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: ఒక్క ఓటు పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు (Ramchandar Rao) అంటున్నారని.. డేట్, టైమిస్తే ఓటు బాధితులందర్నీ తోల్కొనొస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ సవాల్ ను స్వీకరించాలన్నారు. మీడియా ముందు మాట్లాడి తప్పిచ్చుకొని పోకుండా ఉండాలన్నారు. రికార్డులన్నీ చెక్ చేసి చూద్దామన్నారు. పోలీస్ ఫోర్స్ పెట్టుకొని అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కనీస జ్ఞానం తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈమేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. రాంచందర్‌రావుపై విమర్శలు గుప్పించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలి. ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకుందామని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తే ప్రజాస్వామ్యానికి మేలు జరిగేది. కానీ ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనలను తప్పుబడుతూ, ఓటు హక్కు కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా రామ్‌చందర్‌రావు ప్రశ్నించడం సరికాదు.
మా సవాల్‌ను స్వీకరించు
సర్ పై తప్పుడు ఆరోపణలను తిప్పి కొట్టాలి అంటున్నారు.. మీరు తేదీ, సమయం చెప్పండి. ఓటు హక్కు కోల్పోయామని ఆందోళన చెందుతున్న బాధితులను, వారి ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకొస్తా. మా సవాల్‌ను స్వీకరించి తేదీ, సమయం ప్రకటించాలి. ఎన్నికల సంఘం రికార్డులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ఓటర్ల జాబితాలో జరిగిన తొలగింపులపై ఎన్నికల రికార్డులను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వివరించండి. నా ఓటుతో సహా, నా తండ్రి పేరు సత్తయ్య, సత్యనారాయణ గౌడ్ వంటి పేర్లలో ఉన్న వ్యత్యాసాలను సాకుగా చూపి నేను ఆధారాలు చూపకపోతే నా ఓటు తొలగించే ప్రయత్నం జరిగింది. అర్హులైన వారి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగితే వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు, ఎన్నికల వ్యవస్థకు ఉంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి.
దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు పోయాయి.. రాష్ట్ర రాజధాని లోనే 40 లక్షల ఓట్లు కోల్పోయాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సవరణ పేరుతో తొలగిపోయాయి. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకూడదు. ఓటర్ల జాబితా సవరణ అనేది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా చూడటం ఎన్నికల సంఘం బాధ్యత.
దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఎన్ని ఓట్లు తొలగించారు? వాటిలో అనర్హులైనవారి ఓట్లు ఎన్ని? అర్హులైనవారి ఓట్లు పొరపాటున తొలగించబడ్డాయా? అనే అంశాలపై స్పష్టమైన వివరాలు వెల్లడించాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఓట్లను తీసేశారు. పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు తమ ఓటు హక్కును నిరూపించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది.
మాజీ ఉపరాష్ట్రపతి ఉదంతమే చెప్తుంది..
ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ ఇతర ఆధారాలు సమర్పించాలని కోరితే, సాధారణ ప్రజలు తమ హక్కును ఎలా కాపాడుకోవాలో ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేయాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉదంతమే ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఓటరు తన గుర్తింపును నిరూపించుకోవడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? వెంకయ్య నాయుడు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో అన్నారు. ఓటరు నమోదు, ఆధారాల సమర్పణ అంశంపై వచ్చిన ఇంటర్వ్యూ వివరాలను కూడా పరిశీలించాలి.
సామాన్య ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తేలికగా తీసుకోకూడదు. ఓటు హక్కు అనేది కేవలం ఒక గుర్తింపు కాదు. అది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దాలి. కానీ ఆ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కు తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజలు ప్రశ్నిస్తే వారిని కించపరిచే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసం నిలబడాలి.
అర్హులైన ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదన్నదే మా డిమాండ్. ఓటు తొలగినవద్దని ఉద్యమం చేస్తున్న వారిని అవమానించడం తగదు. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరం. అందుకే “ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - రాజ్యాంగాన్ని కాపాడండి” అనే నినాదంతో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది అని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే
- ●Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి
- ●Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు
- ●Talasani Srinivas Yadav | రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు.. ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి తలసాని
- ●Tahsildar Suspended | రైతుపై అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
- ●సెలవొచ్చింది.. సరదా పోయింది! సండేను టాస్క్‌గా మార్చేశామా?

Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే

Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి

Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు

Talasani Srinivas Yadav | రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు.. ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి తలసాని




