Metro Rail Bhavan Employees | జీతాలు ఇంకెప్పుడిస్తారు మహాప్రభో
జీతాలు ఒక్కసారి లేట్ అయితే పర్వాలేదు కానీ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఇదే సమస్య. మా కుటుంబాలు ఎలా గడవాలి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.. అని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.
Metro Bhavan Employees | హైదరాబాద్ మెట్రో రైలు రోజురోజుకూ సరికొత్త రికార్డులతో ముందుకెళ్తుంటే మెట్రోలో పని చేసే ఉద్యోగులు మాత్రం జీతాలు లేక అల్లాడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు కార్యాలయం అయిన మెట్రో భవన్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు గత నెల జీతాలు అందలేదని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది. మెట్రో భవన్‌లో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లాస్ట్ మంత్ జీతాలు రాలేదని చెబుతున్నారు.
సమస్య తాత్కాలికమే.. త్వరలోనే జీతాలు జమ
డిప్యుటేషన్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ క్యాడర్ స్ట్రెంత్ పోస్టులు లేకపోవడం వల్లనే తమకు సరైన సమయానికి జీతాలు రావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు సరైన సమయానికి అందకపోవడం వల్ల కుటుంబ ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతోందని చివరకు ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై స్పందించిన మెట్రో అధికారులు మాత్రం ఈ సమస్య తాత్కాలికమే అని.. త్వరలోనే జీతాలు వాళ్ల అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. జీతాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఇలా ఒక్కసారి కాదు.. జీతాల విషయంలో చాలాసార్లు లేట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రతి రెండు మూడు నెలలకు ఇదే సమస్య
జీతాలు ఒక్కసారి లేట్ అయితే పర్వాలేదు కానీ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఇదే సమస్య. మా కుటుంబాలు ఎలా గడవాలి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.. అని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.
సంబంధిత వార్తలు

Kishan Reddy | మెట్రో రెండో దశకు అభ్యంతరం లేదు.. 50:50 ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధం: కిషన్రెడ్డి
మే 20, 2026

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపండి
మే 6, 2026

Hyderabad Metro Rail | మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రో.. చైర్మన్గా సీఎస్ రామకృష్ణారావు
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



