త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRSV Dharna Indira Park | కేటీఆర్ ధర్నాకు పర్మిషన్.. కానీ కండీషన్స్ అప్లై: ఆంక్షల వలయంలో బీఆర్ఎస్‌వీ ఆందోళన

ఢిల్లీ విద్యార్థులపై లాఠీఛార్జిని ఖండిస్తూ రేపు (జూలై 24) ఇందిరాపార్క్‌లో జరగనున్న కేటీఆర్ ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ భారీ ఆంక్షలు విధించారు.

J

Hyderabad | Published On Jul 23, 2026, 8.55 pm IST

BRSV Dharna Indira Park | కేటీఆర్ ధర్నాకు పర్మిషన్.. కానీ కండీషన్స్ అప్లై: ఆంక్షల వలయంలో బీఆర్ఎస్‌వీ ఆందోళన
Advertisement
  • ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్‌వీ (BRSV) తలపెట్టిన నిరసన దీక్షకు పోలీసుల అనుమతి
  • రేపు (జూలై 24, 2026) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పర్మిషన్
  • ధర్నాలో 1000 మందికి మించి పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు
  • ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ లేదా సచివాలయం వైపు ర్యాలీలు తీయరాదని పోలీసుల వార్నింగ్

BRSV Dharna Indira Park | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జిని ఖండిస్తూ, వారికి మద్దతుగా (Solidarity) భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) శుక్రవారం, జూలై 24, 2026న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత దీక్షకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సైతం పాల్గొననున్న ఈ ధర్నా కార్యక్రమానికి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె. మూర్తి (DCP Rakshitha K. Murthy) అధికారికంగా అనుమతి (Permission) మంజూరు చేశారు. అయితే, ఈ పర్మిషన్ ఆర్డర్‌తో పాటే పోలీసులు పలు కఠిన ఆంక్షల (Restrictions) జాబితాను ఆర్గనైజర్లకు పంపారు.

పోలీసుల కఠిన ఆంక్షలు ఇవే..

బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరుతో ఇచ్చిన ఈ ప్రొసీడింగ్స్‌లో పోలీసులు ప్రధానంగా లా అండ్ ఆర్డర్ (Law and Order) దృష్ట్యా పలు కండీషన్స్ పెట్టారు.

టైమ్ లిమిట్: ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు మాత్రమే ఈ ధర్నాను (Dharna) నిర్వహించాలి.

జనం లిమిట్: ఈ నిరసన కార్యక్రమంలో కేవలం 1000 మంది మాత్రమే పాల్గొనాలి. అంతకుమించి జనసమీకరణ చేయడానికి వీల్లేదు.

నో ర్యాలీస్: ధర్నా అనంతరం లేదా మధ్యలో ఆందోళనకారులు ధర్నా చౌక్ నుంచి తెలంగాణ అసెంబ్లీ (TG Assembly), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ (Secretariat) వైపు వెళ్లేందుకు వీల్లేదు. ఎలాంటి చట్టవిరుద్ధమైన ర్యాలీలు చేయకూడదు.

డీజేలు వద్దు: నిబంధనల ప్రకారం హై వాల్యూమ్ సౌండ్ సిస్టమ్స్, డీజేలు (DJ) ఉపయోగించకూడదు. పరిమితులకు లోబడి మాత్రమే మైక్ వాడుకోవాలి.

సోషల్ మీడియా ప్రచారం: ధర్నాకు భారీగా జనాలను తరలించే ఉద్దేశంతో సోషల్ మీడియాలో (Social Media) ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్లు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదు.

వీడియోగ్రఫీ: మొత్తం కార్యక్రమాన్ని, అందులో వచ్చే ప్రసంగాలను ఆర్గనైజర్లు వీడియోగ్రఫీ చేసి, ఆ ఫుటేజ్‌ను దోమలగూడ పోలీసులకు (Domalguda PS) కచ్చితంగా అప్పగించాలి.

ఇతర నియమాలు: ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకూడదు. డ్రోన్ కెమెరాలు, స్కై లాంతర్లు, బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధం.

ఉల్లంఘిస్తే యాక్షనే!

పోలీసులు జారీ చేసిన ఈ నిబంధనలను అతిక్రమిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు (Legal Action) తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ పర్మిషన్‌ను వెంటనే రద్దు (Cancel) చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లితే ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేశారు.

భగ్గుమంటున్న బీఆర్ఎస్ శ్రేణులు

మరోవైపు, విద్యార్థులకు మద్దతుగా కేవలం శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే పోలీసుల ఇలాంటి అడ్డగోలు ఆంక్షలు విధించడంపై బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం 1000 మందే రావాలని, మధ్యాహ్నం 2 గంటలకే ముగించాలని కండీషన్స్ పెట్టడంపై మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement