త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | కోఠి దొంగ‌లు.. దుస్తులు మార్చుకుని కాలిన‌డ‌క‌న కాచిగూడ వైపు

Hyderabad | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో శ‌నివారం ఉద‌యం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. బ‌ట్ట‌ల వ్యాపారి రిన్షాద్‌పై దోపిడీ దొంగ‌లు కాల్పులు జ‌రిపి అత‌ని వ‌ద్ద ఉన్న రూ. 6 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు.

S

Hyderabad | Published On Jan 31, 2026, 5.26 pm IST

Hyderabad | కోఠి దొంగ‌లు.. దుస్తులు మార్చుకుని కాలిన‌డ‌క‌న కాచిగూడ వైపు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో శ‌నివారం ఉద‌యం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. బ‌ట్ట‌ల వ్యాపారి రిన్షాద్‌పై దోపిడీ దొంగ‌లు కాల్పులు జ‌రిపి అత‌ని వ‌ద్ద ఉన్న రూ. 6 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ ఏటీఎం వ‌ద్ద శ‌నివారం ఉద‌యం జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను అత్యంత తీవ్రంగా ప‌రిగ‌ణించాం. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై సుల్తాన్ బ‌జార్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టార‌ని, నిందితుల‌ను త్వ‌ర‌గా ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని స‌జ్జ‌నార్ తెలిపారు.

కేర‌ళ‌లోని కోజికోడ్‌కు చెందిన‌ రిన్షాద్‌(26) బ‌ట్ట‌ల వ్యాపారి. ప్ర‌స్తుతం నాంప‌ల్లిలోని జ‌న‌తా అపార్ట్‌మెంట్స్‌లో నివ‌సిస్తున్నాడు. దివాన్ దేవ్‌డీలోఓ హోల్‌సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం రూ. 6 ల‌క్ష‌ల న‌గ‌దుతో జ‌న‌వ‌రి 7న హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇక కొనుగోలు కుద‌ర‌క‌పోవ‌డంతో తన బంధువు మిష్బాన్ సలహా మేరకు ఆ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయాల‌ని రిన్షాద్ నిర్ణ‌యించుకున్నాడు.

ఈ క్ర‌మంలో 31న ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో స్నేహితుడు అమీర్‌కు చెందిన వాహ‌నంపై కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకున్నాడు. అక్క‌డ ఏటీఎంలో న‌గ‌దు జ‌మ చేస్తుండగా, ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వెనుకాలే లోప‌లికి ప్ర‌వేశించి తుపాకీతో బెదిరించారు. అంత‌టితో ఆగ‌కుండా రెండు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. దీంతో రిన్షాద్ కుడి కాలికి బుల్లెట్ త‌గిలి తీవ్ర గాయ‌మైంది.

ఇక దోపిడీ దొంగ‌లు.. ఆ న‌గ‌దు సంచితో పాటు వాహ‌నం తాళం చెవుల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నారు. బైక్‌పై ( TS 08 HN 8582) అక్క‌డ్నుంచి చాద‌ర్‌ఘాట్ వైపు ప‌రార్ అయ్యారు. నింబోలి అడ్డా, కాచిగూడ వైపు వెళ్లారు. ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో బ‌ట్ట‌లు మార్చుకుని కాచిగూడ చౌర‌స్తా వైపు కాలి న‌డ‌కన వెళ్లిపోయిన‌ట్లు పోలీసులు గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని, నిందితుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టుకుంటామ‌ని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement