త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Danam Nagender | మూసీ న‌దిని మురికి కాల్వ‌గా చూడొద్దు : ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్

MLA Danam Nagender | మూసీ న‌దిని మురికి కాల్వ‌గా చూడొద్దు.. అది ఒక జీవ‌న‌ది అని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పేర్కొన్నారు. మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని దానం నాగేంద‌ర్ తెలిపారు.

S

Hyderabad | Published On Mar 18, 2026, 11.45 am IST

MLA Danam Nagender | మూసీ న‌దిని మురికి కాల్వ‌గా చూడొద్దు : ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్
Advertisement

MLA Danam Nagender | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ న‌దిని మురికి కాల్వ‌గా చూడొద్దు.. అది ఒక జీవ‌న‌ది అని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పేర్కొన్నారు. మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని దానం నాగేంద‌ర్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మూసీ న‌ది పున‌రుజ్జీవంపై దానం నాగేంద‌ర్ మాట్లాడారు.

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా 10 వేల కుటుంబాల‌ను గుర్తించిన‌ట్లు సోషియో ఎకాన‌మిక్ స‌ర్వేలో తేలింది. వారంద‌రికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామ‌ని అనుమ‌తి తీసుకున్నారు బీఆర్ఎస్ హ‌యాంలో. మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కేటీఆర్ రూప‌క‌ల్ప‌న చేసిన త‌ర్వాత హైద‌రాబాద్‌ స‌ర్వ‌తోముఖాభివృద్ధి చెందాల‌ని యాక్ష‌న్ ప్లాన్ చేశారు. కానీ ఇవాళ మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌ను అడ్డుకోవాల‌ని, ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టాల‌ని బీఆర్ఎస్ నేత‌లు చూస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. మూసీ న‌దిని మురికి కాలువ కింద చూడొద్దు.. అది ఒక జీవ‌న‌ది అని దానం నాగేంద‌ర్ పేర్కొన్నారు.

హైద‌రాబాద్ సిటీ అభివృద్ధి జ‌ర‌గాల‌న్న‌దే మా ల‌క్ష్యం..

మూసీ ప్ర‌క్షాళ‌న‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి డీపీఆర్ ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. హైద‌రాబాద్ సిటీ అభివృద్ధి జ‌ర‌గాల‌న్న‌దే మా ల‌క్ష్యం. ఈ మూసీ అభివృద్ధి జ‌రిగితే.. న‌ల్ల‌గొండ‌కు కూడా మేలు జ‌రుగుతుంది. పార్టీల‌క‌తీతంగా ఒక నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌తో ముందుకు రావాల‌ని కోరుతున్నాను. ప్ర‌భుత్వానికి స‌రైన డైర‌క్ష‌న్ ఇవ్వాలి. మూసీ ప్ర‌క్షాళ‌న‌లో ఎన్ని కుటుంబాలు గుర్తించారు. నిర్మాణ వ్య‌యం ఎంతనో స‌మాధానం చెప్పాలి అని దానం నాగేంద‌ర్ డిమాండ్ చేశారు.

రూ. 30 కోట్ల‌తో ఏర్పాటు చేసిన ట్రాక్ కొట్టుకుపోయింది..

బీఆర్ఎస్ హ‌యాంలో మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో రూ. 30 కోట్ల‌తో ఏర్పాటు చేసిన ట్రాక్ కొట్టుకుపోయింది. ఒక ప్లానింగ్ లేకుండా ట్రాక్ వేస్తే.. ఇలాగే ఉంటుంది. అది వాకింగ్ ట్రాక్. ప్ర‌భుత్వ డ‌బ్బును దుర్వినియోగం చేశారు అని దానం నాగేంద‌ర్ మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement