త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Case on Social Media Posts | మ‌హిళా జ‌డ్జిపై అనుచిత ఆరోప‌ణ‌లు.. చార్మినార్‌లో కేసు న‌మోదు

Case on Social Media Posts | పోక్సో కేసు నిందితుడు బండి భ‌గీర‌థ్ (Bandi Bhagirath) కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళా జ‌డ్జిపై ప‌లువురు అనుచిత ఆరోప‌ణ‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చార్మినార్ పోలీసులు వెల్ల‌డించారు.

S

Hyderabad | Published On May 17, 2026, 1.08 pm IST

Case on Social Media Posts | మ‌హిళా జ‌డ్జిపై అనుచిత ఆరోప‌ణ‌లు.. చార్మినార్‌లో కేసు న‌మోదు
Advertisement

Case on Social Media Posts | త్రినేత్ర‌.న్యూస్‌: పోక్సో కేసు నిందితుడు బండి భ‌గీర‌థ్ (Bandi Bhagirath) కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళా జ‌డ్జిపై ప‌లువురు అనుచిత ఆరోప‌ణ‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

బెయిల్ ఇస్తే భ‌ర్త‌కు పోస్ట్ ఇస్తార‌ని ప్ర‌చారం..

బండి భ‌గీర‌థ్ పోక్సో కేసులో ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా మహిళా జడ్జి మాధ‌విపై అనుచిత ఆరోపణలు చేస్తూ కొంద‌రు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మెన్ పోస్ట్ ఇస్తారని ప్రచారం చేశారు. కేసు విచారణ సందర్భంలోనూ ఈ సోషల్ మీడియా పోస్టులపై జడ్జి మాధవి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఈ క్ర‌మంలో హైకోర్టు రిజిస్ట్రార్ స్పందించారు. దీని వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపిస్తూ చార్మినార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చార్మినార్ పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement