Assistant Professor Jobs | పరీక్ష పెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి
Assistant Professor Jobs | అకాడమీ మార్కులతో కాకుండా పరీక్ష పెట్టి డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు (Assistant Professor Jobs) భర్తీ చేయాలని నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అశోక్ (Ashok) నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
- డెమో ఇంటర్వ్యూలు కూడా ఉండాలి
- జీవో నెం 4, 31ను రద్దు చేయాలి
- నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అశోక్ డిమాండ్
Assistant Professor Jobs | త్రినేత్ర న్యూస్: అకాడమీ మార్కులతో కాకుండా పరీక్ష పెట్టి డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు (Assistant Professor Jobs) భర్తీ చేయాలని నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అశోక్ (Ashok) నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగులతో కలిసి ఆయన మాట్లాడారు. టీచింగ్‌లో అత్యున్నత ఉద్యోగాలైన డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కాలంటే కచ్చితంగా పరీక్షలు నిర్వహించాలన్నారు.
పాత పద్ధతిలోనే చేపట్టాలి
అకాడమీకి 50 మార్కులు, డెమో 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, దీని ద్వారా అక్రమాలు జరిగి నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. యూజీసీ నిబంధనల పేరుతో ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలను అమ్ముకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జీవో నెంబర్ 31 రద్దు చేసి, స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 1:5 అభ్యర్థులను సెలెక్ట్ చేయాలన్నారు. డెమో ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలని సూచించారు. డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీని పాత పద్ధతిలోనే ఎగ్జామ్ నిర్వహించడం ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అకాడమీ మార్కుల ద్వారా సబ్జెక్టు ఉన్నవారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని వాపోయారు. ప్రస్తుతం డిగ్రీ, పీజీ లలో 20 మార్కులు అసైన్మెంట్ కేటాయించిన కారణంగా మార్కులు ఎక్కువ వచ్చాయని, 10 సంవత్సరాల క్రితం పీజీ చేసినవారికి తక్కువ మార్కులు వచ్చాయని చెప్పారు. దీని ద్వారా సీనియర్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.
యూజీసీ నిబంధనల పేరుతో ..
పక్క రాష్ట్రమైన ఏపీలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు యూజీసీ నిబంధనలు కాకుండా జీఎస్ 150 సబ్జెక్టు 300 మార్కులకు ఎగ్జామ్ నిర్వహించి భర్తీ చేశారని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నియామకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ ఎగ్జాం ద్వారానే నియామకాలు చేపడుతున్నారని వివరించారు. ఒక తెలంగాణలోనే యూజీసీ నిబంధనల పేరుతో ఉద్యోగాలు అమ్ముకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేశ్, శ్రీకాంత్ రెడ్డి, నాగేంద్ర చారి, నరసింహ గౌడ్, విద్యాసాగర్, సారంగం వెంకటేశం, విన్నర్ చోళ, ప్రణీత్ కిరణ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Phone Tapping Case | గవర్నర్ అనుమతి లేకుండానే కేసీఆర్ పై చార్జిషీట్?
- ●ISRO Privatisation | ఇస్రో ప్రైవేటీకరణ నిజమేనా?
- ●CBFC Data Leak | సినీ ఇండస్ట్రీలో కలకలం: సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్
- ●DK Shivakumar Warning IT Firms | కన్నడ వారికి ఉద్యోగాల్లో మొండిచెయ్యి చూపిస్తే ఊరుకోం
- ●Anant Singh | నితీశ్ లేరు.. ఇక జేడీయూ పని అయిపోయింది
- ●Air Chief Marshal A.P. Singh | భారత్ చేరుకోలేని లక్ష్యం లేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

Phone Tapping Case | గవర్నర్ అనుమతి లేకుండానే కేసీఆర్ పై చార్జిషీట్?

ISRO Privatisation | ఇస్రో ప్రైవేటీకరణ నిజమేనా?

CBFC Data Leak | సినీ ఇండస్ట్రీలో కలకలం: సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్

DK Shivakumar Warning IT Firms | కన్నడ వారికి ఉద్యోగాల్లో మొండిచెయ్యి చూపిస్తే ఊరుకోం





