J Santosh Kumar Nominated for Prestigious Global Green Icon Award | మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం……….. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఏప్రిల్ 17న ప్రదానం
పర్యావరణ పరిరక్షణలో అద్భుత కృషి చేస్తున్న 'ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్' (IMO) చైర్మన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక హౌస్ ఆఫ్ లార్డ్స్ (బ్రిటన్ పార్లమెంట్)లో జరిగే వరల్డ్ లీడర్స్ కాంక్లేవ్, అవార్డ్స్‌కు ఆయన నామినేట్ అయ్యారు.
- బ్రిటన్ పార్లమెంట్ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో జరిగే వరల్డ్ లీడర్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ నామినేట్
- మాజీ రాష్ట్రపతి కలాం స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ, హరిత స్పృహ కోసం నిరంతరం కృషి చేస్తున్న 'ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్' (IMO)
- "హరా హై తో భరా హై" స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ మొక్కలు నాటే కార్యక్రమాలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు
- ఏప్రిల్ 17, 2026 న లండన్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గ్లోబల్ సస్టైనబిలిటీ లీడర్లతో పాటు అవార్డు ప్రదానం
J Santosh Kumar Nominated for Prestigious UK Parliament Award | త్రినేత్ర.న్యూస్ :
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ నిర్వాహకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం దక్కింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఏప్రిల్ 17న ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో 'ఇగ్నైటింగ్ మైండ్స్' నిరంతర కృషి చేస్తున్నది. ముఖ్యంగా సంతోష్ కుమార్ ప్రారంభించిన "హరా హై తో భరా హై" (ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు) నినాదంతో ముందుకొచ్చిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' దేశవ్యాప్తంగా పర్యావరణ బాధ్యతను ఒక సత్సంప్రదాయంగా మార్చింది. విద్యార్థులు, యువత, రైతులు, సామాన్యుల నుంచి జాతీయ స్థాయి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ఉద్యమంలో భాగస్వాములై మిలియన్ల కొద్దీ మొక్కలు నాటారు.
లండన్ పార్లమెంట్ (హౌస్ ఆఫ్ లార్డ్స్) లో వేడుక
పర్యావరణ పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై పోరాడుతున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించి వారికి పురస్కారాలు అందిస్తున్న బ్రిటన్ సంస్థ హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్ ఏప్రిల్ 17న అంతర్జాతీయ కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో సంతోష్ కుమార్ కు 'గ్లోబల్ గ్రీన్ ఐకాన్' పురస్కారాన్ని అందజేస్తారు. 'వరల్డ్ లీడర్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్' (World Leaders Conclave & Awards)లో ఆయనకు ఈ గౌరవం దక్కనుంది. ఈ ప్రతిష్టాత్మక కాంక్లేవ్‌ను హెలిన్ స్పార్క్ స్ట్రాటజిక్స్ యూకే లిమిటెడ్ నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి (Sustainability), వాతావరణ మార్పులపై పోరాడుతున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించి ఈ అవార్డులను అందజేస్తారు. ఇందులో సంతోష్ కుమార్ 'గ్లోబల్ గ్రీన్ ఐకాన్' గా నామినేట్ కావడం విశేషం.
జనంలోకి చొచ్చుకుపోయిన పర్యావరణ స్పృహ
భారతదేశంలో పర్యావరణ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో 'ఇగ్నైటింగ్ మైండ్స్' నిరంతర కృషి చేస్తోంది. ముఖ్యంగా సంతోష్ కుమార్ ప్రారంభించిన "హరా హై తో భరా హై" (ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు) నినాదంతో ముందుకొచ్చిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' దేశవ్యాప్తంగా పర్యావరణ బాధ్యతను ఒక సత్సంప్రదాయంగా మార్చింది. విద్యార్థులు, యువత, రైతులు, సామాన్యుల నుంచి జాతీయ స్థాయి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ఉద్యమంలో భాగస్వాములై మిలియన్ల కొద్దీ మొక్కలు నాటారు.
అందరి సమిష్టి కృషికే ఈ గుర్తింపు: ఐఎంవో
ఈ గౌరవం పట్ల జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన ఒక్కడికి దక్కిన గౌరవం కాదని, పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు.
ఈ అంతర్జాతీయ గుర్తింపుపై 'ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్' స్పందిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆదర్శాలతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి భావితరాలకు పచ్చని భూమిని అందించడమే తమప్రధాన లక్ష్యమని పేర్కొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Green India Challenge | గ్రీన్ ఇండియా టూ IIM బెంగళూరు: క్లైమేట్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న జోగినిపల్లి సంతోష్ కుమార్
మే 18, 2026

Joginapally Santosh Kumar | జనం నమ్మకమే నీ గెలుపు.. టీవీకే అధినేత దళపతి విజయ్‌కు సంతోష్ కుమార్ అభినందనలు
మే 4, 2026

Green India Challenge | ఈ గౌరవం కేసీఆర్‌కు అంకితం: జోగినపల్లి సంతోష్ కుమార్
ఏప్రిల్ 29, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



