త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Police | నాలుగు పాల‌పిట్ట‌ల‌ను కాపాడిన హైద‌రాబాద్ పోలీసులు

Hyderabad Police | ద‌స‌రా పండుగ వేళ పాల‌పిట్ట‌ల‌ను( Palapitta ) బంధించి ఇబ్బందుల‌కు గురి చేసిన వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైద‌రాబాద్ సీపీ సజ్జ‌నార్( CP Sajjanar ) హెచ్చ‌రించారు. ప‌లు చోట్ల బంధించిన నాలుగు పాల‌పిట్ట‌ల‌ను ప్రాణాల‌తో కాపాడిన‌ట్లు తెలిపారు.

S

Hyderabad | Published On Oct 21, 2026, 1.20 pm IST

Hyderabad Police | నాలుగు పాల‌పిట్ట‌ల‌ను కాపాడిన హైద‌రాబాద్ పోలీసులు
Advertisement

Hyderabad Police | త్రినేత్ర న్యూస్ : ద‌స‌రా పండుగ వేళ పాల‌పిట్ట‌ల‌ను( Palapitta ) బంధించి ఇబ్బందుల‌కు గురి చేసిన వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైద‌రాబాద్ సీపీ సజ్జ‌నార్( CP Sajjanar ) హెచ్చ‌రించారు. ప‌లు చోట్ల బంధించిన నాలుగు పాల‌పిట్ట‌ల‌ను ప్రాణాల‌తో కాపాడిన‌ట్లు తెలిపారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు చోట్ల పాల‌పిట్ట‌ల‌ను బంధించిన‌ట్లు న‌గ‌ర పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారని సీపీ తెలిపారు.

లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించగా.. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, అలాగే మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు అని సూచించారు.

వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నాం అని స‌జ్జ‌నార్ సూచించారు.

Advertisement
Advertisement