త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio IPO | జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్..

Jio IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచిన ఈ ఐపీఓ ప్రారంభమైన కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూకు తొలి రోజే పెట్టుబడిదారులు భారీగా దరఖాస్తులు సమర్పించారు.

S

Business | Published On Oct 21, 2026, 1.10 pm IST

Jio IPO | జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్..
Advertisement

Jio IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచిన ఈ ఐపీఓ ప్రారంభమైన కేవలం 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూకు తొలి రోజే పెట్టుబడిదారులు భారీగా దరఖాస్తులు సమర్పించారు. తాజా గణాంకాల ప్రకారం, ఐపీఓ మొత్తం 1.14 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారుల (క్యూఐబీ) విభాగం 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ ఐపీఓ అక్టోబర్ 23 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది.

యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ల నుంచి 30 రెట్ల డిమాండ్..

పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే జియో ఐపీఓపై పెట్టుబడిదారుల్లో భారీ ఆసక్తి కనిపించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన సుమారు రూ.8,110 కోట్ల విలువైన షేర్లకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా విలువైన బిడ్లు వచ్చాయి. అంటే, అందుబాటులో ఉన్న షేర్ల కంటే 30 రెట్లకు మించిన డిమాండ్ నమోదైంది. ఈ విభాగంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అత్యధికంగా సుమారు రూ.500 కోట్ల విలువైన షేర్ల కేటాయింపును పొందింది. ఐపీఓ పరిమాణం పరంగా కూడా జియో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద ఐపీఓగా హ్యుందాయ్ మోటార్ ఇండియా నిలిచింది. ఆ సంస్థ 2024లో రూ.27,870 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూను నిర్వహించింది. ఇప్పుడు జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ.30,213 కోట్ల ఐపీఓతో ఆ రికార్డును అధిగమించింది. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.1,065 నుంచి రూ.1,119 మధ్య నిర్ణయించారు.

వాటాదారుల‌కు అద‌న‌పు అవ‌కాశం..

మరోవైపు, ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అర్హత కలిగిన వాటాదారులకు షేర్ల కేటాయింపు పొందేందుకు అదనపు అవకాశం ఉంది. వీరి కోసం రూ.2,500 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. అర్హత కలిగిన పెట్టుబడిదారులు వాటాదారుల విభాగంతోపాటు రిటైల్ విభాగంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా రెండు విభాగాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా షేర్ల కేటాయింపు పొందే అవకాశాన్ని పెంచుకునే వీలుంటుంది. అయితే, రెండు విభాగాల్లో దరఖాస్తు చేసినంత మాత్రాన షేర్ల కేటాయింపు ఖాయమవుతుందని భావించకూడదు.

Advertisement
Advertisement