Deer | కర్ణాటకలో జింకల వేట.. హైదరాబాద్‌లో మాంసం విక్రయం
Deer | హైదరాబాద్ నగరంలో జింక( Deer ) మాంసం కలకలం సృష్టించింది. మాంసాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ ముగ్గురు వ్యక్తులను మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.
Deer | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరంలో జింక( Deer ) మాంసం కలకలం సృష్టించింది. మాంసాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ ముగ్గురు వ్యక్తులను మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. మలక్‌పేటలో వాహనాల తనిఖీల సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది.
అయితే నిన్న మలక్‌పేటలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ మహీంద్రా స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. జింక మాంసం, ఓ రైఫిల్, 8 బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, రీచార్జబుల్ బ్యాటరీ లభ్యం అయ్యాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
నిందితులు కర్ణాటకలోని కాలబురిగి జిల్లా అటవీ ప్రాంతంలో జింకల వేటకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. ముగ్గురు కలిసి 12 రౌండ్లు కాల్పులు జరిపి జింకలను బంధించినట్లు తెలిసింది. నిందితులను సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహ్మద్ హమీద్‌లుగా గుర్తించారు. ఆర్మ్స్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణతో పాటు సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. వేటకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు భావిస్తున్న ఓ ఫోన్‌ని ధ్వంసం చేసినట్లు సమాచారం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకువస్తా
- ●Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు
- ●Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య
- ●Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..
- ●అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!
- ●Palitana Temples Gujarat | ఆ కొండపై 900 పాలరాతి ఆలయాలు.. కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక్క మనిషి కూడా ఉండకూడదు!

Harish Rao | త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకువస్తా

Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు

Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య

Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..




