త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMRL | ప్రతి 4 నిమిషాలకో మెట్రో ట్రైన్​..

HMRL | హైదరాబాద్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సర్వీసులను పెంపుతున్నట్లు మెట్రో ప్రకటించింది. మియాపూర్ - ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు తెలిపింది.

S

Hyderabad | Published On Apr 22, 2026, 2.21 pm IST

HMRL | ప్రతి 4 నిమిషాలకో మెట్రో ట్రైన్​..
Advertisement

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులు పెంపు
56 మెట్రో రైళ్లు నడపాలని నిర్ణయం

HMRL | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సర్వీసులను పెంపుతున్నట్లు మెట్రో ప్రకటించింది. మియాపూర్ - ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్ - రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.

మియాపూర్ - ఎల్బీ నగర్ కారిడార్

సాధారణంగా పీక్ అవర్స్‌లో 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు, నాన్-పీక్‌లో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు.

నాగోల్ - రాయదుర్గ్ కారిడార్ :

సాధారణంగా నాన్-పీక్‌లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు. సాధారణంగా వారపు రోజుల్లో ఉదయం 8 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు మాత్రమే 56 రైళ్లు నడిపేవారు. నాన్-పీక్ అవర్స్‌లో 44 రైళ్లకు తగ్గించేవారు. సమ్మె కారణంగా ఇప్పుడు ఆ తగ్గింపు ఉండదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులు పొడిగించే అవకాశాన్ని ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ పరిశీలిస్తోందని స్పష్టం చేసిన హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ తెలిపారు.

Advertisement
Advertisement