త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Excellence Awards | నేర దర్యాప్తులో ప్రతిభకు గుర్తింపు.. తొలిసారిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డులు

P

Hyderabad | Published On Jun 3, 2026, 7.25 pm IST

Excellence Awards | నేర దర్యాప్తులో ప్రతిభకు గుర్తింపు.. తొలిసారిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డులు
Advertisement

Excellence Awards | నేర పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి, పక్కా శాస్త్రీయ దర్యాప్తు ద్వారా బాధితులకు సంపూర్ణ న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కేసుల దర్యాప్తును పకడ్బందీగా చేపట్టి, పక్కా ఆధారాలతో న్యాయస్థానాల్లో నేర నిరూపణ చేసే అధికారులకు ఈ ఏడాది నుంచి ప్రత్యేక పురస్కారాలను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ‘హైద‌రాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్' (Excellence Award for Best Investigation)ను ప్రవేశపెట్టింది. కేసుల్లో దర్యాప్తు జరిపి, 5 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడేలా చేసిన 14 మందికి ఈ కేట‌గిరిలో అవార్డులు వ‌రించాయి. అందులో నలుగురు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, 10 మంది కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు ఉన్నారు.

మ‌రో కేట‌గిరి 'హైద‌రాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్' (Excellence Award for Best Performance) కింద విధుల్లో చురుగ్గా పాల్గొన్న 18 మందికి అవార్డులు ద‌క్కాయి. అందులో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, ఐదుగురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ రెండు కేట‌గిరిల్లో మొత్తంగా 32 మందిని పుర‌స్కారాల‌కు ఎంపిక చేశారు. వీరంతా జూన్ 2025 నుంచి ఈ ఏడాది మే వ‌ర‌కు కేసుల ద‌ర్యాప్తులో, విధుల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచినందుకు ఈ అవార్డులు వ‌రించాయి. కేసు నమోదు నుంచి శిక్ష పడే వరకు ప్రతి దశలోనూ వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. పోలీసు వ్యవస్థలో దర్యాప్తు ప్రమాణాలను మెరుగుపరచడం, క్షేత్రస్థాయి సిబ్బందిలో స్ఫూర్తిని నింపడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. పక్కా శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా సిబ్బందిలో సానుకూల పోటీ తత్వాన్ని పెంచవచ్చని హైద‌రాబాద్ సిటీ పోలీస్ భావిస్తోంది. విధుల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించేలా దోహదపడే ఈ సత్సంప్రదాయాన్ని ఇకపై ప్రతి ఏటా కొనసాగించాలని నిర్ణయించింది.

హైదరాబాద్ పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసు నమోదు చేయడం దర్యాప్తులో మొదటి అడుగు మాత్ర‌మేన‌న్నారు. శాస్త్రీయ ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు సంపూర్ణ న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్య‌మ‌ని చెప్పారు. ఈ దిశగా కృషి చేసిన అధికారులను గుర్తించి ప్రోత్సహించడం వల్ల ఇతరుల్లోనూ స్ఫూర్తి కలుగుతుంది. విధుల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించేలా ఈ పురస్కారాలు దోహదపడతాయి. ఈ సత్సంప్రదాయాన్ని ఇకపైనా కొన‌సాగిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి నిజాయితీ చాటుకున్న సామాన్య పౌరులను, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను కూడా ప్రత్యేకంగా గౌరవించిన‌ట్లు తెలిపారు. నిజాయితీ గల వ్యక్తులు, పట్టుదల గల ప్రతిభావంతులు సమాజానికి వెలుగునిచ్చే దీపాలని అన్నారు. ఇలాంటి వ్యక్తులను గౌరవించడం ద్వారా పౌరుల్లో సరికొత్త స్ఫూర్తిని నింపడమే తమ లక్ష్యమని చెప్పారు.

బెస్ట్ ఇన్వెస్టిగేష‌న్ కేటగిరి : (ద‌ర్యాప్తు అధికారులు)

  • కే ముర‌ళీధ‌ర్ (ఇన్‌స్పెక్ట‌ర్, సీసీఎస్)
  • ఎం ముత్తు యాద‌వ్ (ఎస్‌హెచ్‌వో, రాజేంద్ర‌న‌గ‌ర్)
  • ఏ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (ఎస్సై, రాజేంద్ర‌న‌గ‌ర్)
  • ఎం.స్వామి (ఎస్సై, సైఫాబాద్)

కోర్టు డ్యూటీ ఆఫీస‌ర్లు:

  • నేనావ‌త్ శేఖ‌ర్ (పీసీ, సనత్ నగర్)
  • పీ వీరాంజ‌నేయులు (పీసీ, గుడిమల్కాపూర్)
  • వై ఆంజ‌నేయులు (పీసీ, గోషామహాల్)
  • ఎం సుమలత (డబ్ల్యూపీసీ, షీటీమ్స్)
  • బీ సుద‌ర్శ‌న్ (హెచ్‌సీ, అబిడ్స్)
  • కే సాయి కిర‌ణ్ (పీసీ, భవానీ నగర్)
  • బిక్ష‌ప‌తి (హెచ్‌సీ, మీర్‌పేట)
  • కే శ్రీనివాస్ రెడ్డి (హెచ్‌సీ, బాలాపూర్)
  • వీ శ్రీనివాస్ (పీసీ, ఆదిభట్ల)
  • ఎస్ మ‌ల్లేష్ నాయ‌క్ (పీసీ, మెహిదీపట్నం)

బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేట‌గిరి

  • డీ అశోక్ (ఇన్స్పెక్టర్, సనత్ నగర్)
  • ఎస్ విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి (డీఐ, బండ్ల‌గూడ)
  • ఎస్ ర‌మేశ్ (ఇన్‌స్పెక్ట‌ర్, ఐటీ సెల్)
  • పీ జ్ఞానదీప్ (ఎస్సై, టాస్క్ ఫోర్స్)
  • స‌య్య‌ద్ మునావ‌ర్ అలీ (ఎస్సై, లంగ‌ర్‌హౌజ్)
  • జీ ప్ర‌వ‌ళిక‌ (డ‌బ్ల్యూఆర్ఎస్సై, సీఏఆర్ హెచ్‌క్యూ)
  • ఏకే రోజీ (డ‌బ్ల్యూఏఏస్సై, ట్రాఫిక్)
  • కే హ‌రిరామ్ (ఏఎస్సై, సైబ‌ర్ క్రైమ్స్)
  • ఎం వెంక‌టేశ్వ‌ర్లు (ఏఎస్సై, మ‌ల‌క్‌పేట‌)
  • వీ మోహ‌న్ రావు (ఏఎస్సై, ముషీరాబాద్)
  • జీ విశ్వ‌నాథం (ఏఎస్సై, సీసీఎస్)
  • కే ప్ర‌భు (హెచ్‌సీ, మెహిదిప‌ట్నం)
  • ఏ రెడ్డాంకయ్య (హెచ్‌సీ, హెచ్‌-ఫాస్ట్)
  • సీహెచ్ సుధాక‌ర్ రాజు (హెచ్‌సీ, కాచిగూడ)
  • కే దినేశ్ కుమార్ (పీసీ, కుల్సుంపుర)
  • డీ శ్రీనయ్య (పీసీ, సీసీఎస్)
  • ఎండీ జీలాని (పీసీ, పంజాగుట్ట)
  • ఏ శివ మ‌నోహ‌ర్ (పీసీ, హెచ్‌-న్యూ)

ఐదుగురికి స‌త్కారం..

  • సర్దార్ హరి హర్ సింగ్ (రిటైర్డ్ అడిషనల్ డీసీపీ): రిటైర్మెంట్ తర్వాత కూడా ఫిట్‌నెస్, క్రమశిక్షణతో యువతకు రోల్ మోడల్‌గా నిలిచినందుకు గుర్తింపు.
  • డాక్టర్ క్వీనీ విక్టోరియా గండం: ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్ వరకు ఉన్న 'ఇంగ్లీష్ ఛానల్'ను రిలే ఈత ద్వారా విజయవంతంగా దాటిన తెలుగు రాష్ట్రాల తొలి మహిళగా నిలిచినందుకు స‌త్కారించారు.
    స్టీఫెన్ కుమార్: తన తల్లి డాక్టర్ క్వీనీ విక్టోరియా గండం తో కలిసి అంతర్జాతీయ ఈత పోటీల్లో రాణిస్తూ, 'కాటలినా ఛానల్', 'కుక్ స్ట్రెయిట్' సముద్ర భాగాలను ఈదిన తెలంగాణ తొలి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించినందుకు స‌న్మానించారు.
  • మిర్జా ముజఫర్ (జెప్టో డెలివరీ): నారాయణగూడలో దొరికిన రూ. 1,30,000 నగదును వెంటనే పోలీసులకు అప్పగించి బాధితుడికి అందేలా చేసిన అసాధారణ నిజాయితీకి గుర్తింపుగా స‌త్క‌రించారు.
  • మోదం వెంకటయ్య (ఆటో డ్రైవర్): తన ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ. 1,20,000 నగదును పోలీసులకు అప్పగించి, ఆపరేషన్ కోసం డబ్బు అవసరమైన బాధితుడిని ఆదుకున్నందుకు స‌న్మానించారు.
  • జీ వెంకటేష్ : పార్సిగుట్ట ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక స్మార్ట్ ఫోన్ రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే నల్లకుంట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఫోన్ ను అందజేశారు. అదే సమయంలో బాధితుడు కూడా అక్కడే ఉన్మారు. పోలీసుల సమక్షంలో ఆ స్మార్ట్ ఫోన్ ను అప్పగించారు.
Advertisement
Advertisement