త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌.. రెండురోజుల షెడ్యూల్ ఇదే..

CM Revanth Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజులు పర్యటించనున్నారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. గురువారం సోమ‌శిల‌లో బ‌స చేయ‌నున్నారు. శుక్ర‌వారం ఉద్దండాపూర్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు.

P

Telangana | Published On Jun 3, 2026, 6.10 pm IST

CM Revanth Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌.. రెండురోజుల షెడ్యూల్ ఇదే..
Advertisement

CM Revanth Reddy | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజులు పర్యటించనున్నారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. గురువారం సోమ‌శిల‌లో బ‌స చేయ‌నున్నారు. శుక్ర‌వారం ఉద్దండాపూర్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. రేపు మ‌ధ్యాహ్నం 3 గంటలకు సీఎం నారాయణపేట జిల్లా మక్తల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLI), బీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులు వివరించనున్నారు. మధ్యాహ్నం 3.40 గంటల నుంచి 4 గంటల వరకు మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సీఎం పరిశీలిస్తారు.

సాయంత్రం 4.10 గంటలకు మక్తల్ హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం, అక్కడి నుంచి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా–భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా ప‌రిశీలిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి హెలిప్యాడ్‌కు సీఎం చేరుకుంటారు. సాయంత్రం 4.55 గంటల నుంచి 5.30 గంటల వరకు గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఐఎస్ (JNLIIS) స్టేజ్–1 పంప్‌హౌస్ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు మృగవాణి రిసార్ట్ రివర్‌ఫ్రంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వ‌హించ‌నున్నారు.

శుక్ర‌వారం రోజున ఉదయం 10.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్‌హౌస్‌కు సీఎం చేరుకుంటారు. ఉదయం 10.40 గంటల నుంచి 11.40 గంటల వరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) ప్యాకేజీ–3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ–2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ–1 డెలివరీ సిస్టర్న్, ఎంజీఎకేఎల్ఐఎస్ (MGKLIS) లిఫ్ట్–1 పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. ఉదయం 11.50 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు నార్లాపూర్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ–3 కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు కుమ్మెర హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ–8 స్టేజ్–3 పంప్‌హౌస్, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీలు 9, 10, 11 పనులను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్ హెలిప్యాడ్‌కు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 2.30 గంటల వరకు కరివేన రిజర్వాయర్ ప్యాకేజీలు 14, 15 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు సీఎం మీడియా సమావేశం నిర్వహించే అవ‌కాశం ఉన్న‌ది. సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.10 గంటల నుంచి 5.40 గంటల వరకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను ప‌రిశీలిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని, 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఉద్దండాపూర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరుతారు. దాంతో రెండురోజుల ప‌ర్య‌ట‌న ముగుస్తుంది. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement
Advertisement