త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyberabad | వ‌ర్షాకాలం ముంపు ప్ర‌మాదం.. ప‌రిశీలించిన అధికారులు

Cyberabad | రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయి ప‌ర్య‌టించారు. రోడ్లపై నీరు నిలిచే ప‌రిస్థితి లేకుండా చూడ‌డం, ట్రాఫిక్‌కు అంత‌రాయాన్ని నివారించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టారు.

P

Hyderabad | Published On Jun 3, 2026, 5.42 pm IST

Cyberabad | వ‌ర్షాకాలం ముంపు ప్ర‌మాదం.. ప‌రిశీలించిన అధికారులు
Advertisement

Cyberabad | రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయి ప‌ర్య‌టించారు. రోడ్లపై నీరు నిలిచే ప‌రిస్థితి లేకుండా చూడ‌డం, ట్రాఫిక్‌కు అంత‌రాయాన్ని నివారించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్, మున్సిపల్ కమిషనర్ జీ శ్రీజన కలిసి ఐటీ కారిడార్‌లో నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలను సందర్శించారు. ఇంజినీరింగ్ విభాగ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలపై సూచనలు చేశారు. ఈ పరిశీలనలో భాగంగా మల్కం చెరువు – బయోడైవర్సిటీ జంక్షన్ (కేర్ హాస్పిటల్) ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. భారీ వర్షాల సమయంలో ఈ ప్రాంతంలో రోడ్లపై నీరు నిలవడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

అలాగే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్, కొండాపూర్‌లోని హర్షా టయోటా షోరూమ్ జంక్షన్ తదితర ప్రాంతాలను కూడా పరిశీలించి, వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యపై శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో నీరు నిలవడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. మున్సిపల్, పోలీస్, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. ఈ పర్యటనలో సెరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, కూకట్‌పల్లి డీసీపీ రితురాజ్, అడిషనల్ డీసీపీ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement