త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMDA Clay Ganesha Distribution 2026 | పర్యావరణహితంగా వినాయక చవితి: ఉచితంగా మట్టి గణపతులు.. పంపిణీ కేంద్రాల వివరాలు ఇవే

పర్యావరణ పరిరక్షణ కోసం HMDA ఈ ఏడాది కూడా ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ పంపిణీ కేంద్రాల వివరాలు ఇవే.

J

Hyderabad | Published On Sep 8, 2026, 6.14 pm IST

HMDA Clay Ganesha Distribution 2026 | పర్యావరణహితంగా వినాయక చవితి: ఉచితంగా మట్టి గణపతులు.. పంపిణీ కేంద్రాల వివరాలు ఇవే
Advertisement
  • పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి HMDA ఏర్పాట్లు
  • హైదరాబాద్ వ్యాప్తంగా 34 కేంద్రాల్లో సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు పంపిణీ
  • మొత్తంగా 1,33,000 విగ్రహాలు (8 అంగుళాలు, 1 అడుగు పరిమాణంలో) పంపిణీ చేయనున్న హెచ్ఎండీఏ
  • ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాల వాడకాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం

HMDA Clay Ganesha Distribution 2026 | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, పర్యావరణహితమైన (Eco-friendly) పండుగలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరోసారి ముందుకొచ్చింది. వినాయక చవితి సందర్భంగా జల కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది.

1.33 లక్షల మట్టి వినాయకులు..

నీటిలో కరిగేలా, జల వనరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండే 'ఎకో గణేశ్' లేదా 'గ్రీన్ గణేశ్' వాడకాన్ని 2017 నుంచి HMDA ఉచితంగా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది కూడా నగరవాసులతో పాటు స్వచ్ఛంద సంస్థలను (NGOs) భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనుంది. సెప్టెంబర్ 9, 2026 నుంచి సెప్టెంబర్ 13, 2026 వరకు హైదరాబాద్‌లోని 34 ప్రధాన ప్రాంతాల్లో ఈ పంపిణీ జరగనుంది. 8 అంగుళాల సైజులో ఉన్న 80,000 విగ్రహాలు, 1 అడుగు సైజులో ఉన్న 53,000 విగ్రహాలు.. మొత్తంగా 1,33,000 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందించనున్నారు.

ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కేంద్రాలు ఇవే

పంపిణీ కేంద్రం పంపిణీ తేదీలు
ఆరోగ్యశ్రీ, సైలెంట్ వ్యాలీ హిల్స్, జూబ్లీహిల్స్ 09.09.2026, 10.09.2026
రైతుబజార్, మెహదీపట్నం 12.09.2026
KBR పార్క్ ప్రధాన గేటు, జూబ్లీహిల్స్ 10.09.2026, 11.09.2026
హిందూ న్యూస్‌పేపర్ ఆఫీస్ దగ్గర, బేగంపేట 10.09.2026, 11.09.2026
ప్రెస్ క్లబ్, సోమాజిగూడ 11.09.2026, 12.09.2026
ఎల్లమ్మ ఆలయం, బాల్కంపేట 10.09.2026, 11.09.2026
కోత్వాల్‌గూడ ఎకో పార్క్ 10.09.2026, 11.09.2026
పెద్దమ్మ ఆలయం, జూబ్లీహిల్స్ 12.09.2026, 13.09.2026
శిల్పారామం, మాదాపూర్ 09.09.2026, 10.09.2026
మెట్రో క్యాష్ అండ్ క్యారీ, కూకట్‌పల్లి 12.09.2026
శిల్పారామం, ఉప్పల్ 09.09.2026, 10.09.2026
గణేష్ టెంపుల్, సికింద్రాబాద్ 11.09.2026
HMDA ఆఫీస్, అమీర్‌పేట్ (UIDAI–ఆధార్) 09.09.2026 నుంచి 11.09.2026
ట్యాంక్‌బండ్ 10.09.2026, 11.09.2026
సచివాలయం 10.09.2026, 11.09.2026
ఎన్టీఆర్ గార్డెన్ & HMDA గ్రౌండ్స్ 12.09.2026, 13.09.2026
ప్రియదర్శిని పార్క్, సరూర్‌నగర్ 09.09.2026, 10.09.2026
రాజీవ్ గాంధీ పార్క్, వనస్థలిపురం 11.09.2026, 12.09.2026
కుందన్‌బాగ్ (లైఫ్‌స్టైల్ దగ్గర), బేగంపేట 09.09.2026, 10.09.2026
దుర్గం చెరువు పార్క్ గేటు 12.09.2026
మెల్‌కోటే పార్క్, నారాయణగూడ 09.09.2026, 10.09.2026
VDP స్కూల్, ఓల్డ్ సిటీ 12.09.2026
భారతీయ విద్యా భవన్ 09.09.2026, 10.09.2026
వాయుపురి రిక్రియేషన్ సెంటర్ 11.09.2026, 12.09.2026
సఫిల్‌గూడ పార్క్ 13.09.2026
మైండ్‌స్పేస్ జంక్షన్, మాదాపూర్ 09.09.2026, 10.09.2026
మై హోమ్ నవద్వీప దగ్గర, మాదాపూర్ 10.09.2026, 11.09.2026
తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్ 09.09.2026, 10.09.2026
బండ్లగూడ (TSRTC బస్ డిపో ఆపోజిట్), నాగోల్ 09.09.2026
HGCL ఆఫీస్ 10.09.2026, 11.09.2026
తెలంగాణ హైకోర్టు 11.09.2026

మొబైల్ పంపిణీ కేంద్రాలు (Mobile Distribution)

స్థిరమైన పంపిణీ కేంద్రాలతో పాటు, ఎంపిక చేసిన రెసిడెన్షియల్ ఏరియాల్లో మొబైల్ పంపిణీ ద్వారా కూడా విగ్రహాలను అందించనున్నారు.

  • సెప్టెంబర్ 9న 'హైదరాబాద్ జిందాబాద్' వద్ద.
  • సెప్టెంబర్ 12న మియాపూర్‌లోని SMR వినయ్, మై హోమ్ జువెల్, కూకట్‌పల్లిలోని ఇందు ఫార్చూన్, మాదాపూర్‌లోని రామ్‌కీ టవర్స్ & డెలాయిట్, అలాగే KPHB మలేషియన్ టౌన్‌షిప్‌లో పంపిణీ జరుగుతుంది.
  • సెప్టెంబర్ 11న డా. MCR HRD, చైతన్య మహిళా మండలి లాంటి వెల్ఫేర్ అసోసియేషన్స్ (Welfare Associations) వద్ద విగ్రహాలు అందజేస్తారు.

మరిన్ని వివరాలకు లేదా సమన్వయం కోసం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్ (9849906745), డిప్యూటీ ఈఈ జె.గణేష్ (7989371104) లను సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement