Priyanka Mohan | ప్రియాంక మోహన్ కెరీర్‌కు బ్రేక్.. వరుసగా చిన్న సినిమాలే! అసలేం జరుగుతోంది?
Priyanka Mohan | టాలీవుడ్, కోలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ప్రియాంక మోహన్. స్టార్ హీరోల సరసన వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆమె కెరీర్ కాస్త డల్‌గా సాగుతోందా? అంటే.. తాజాగా ఓ మూవీ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో ఇదే చర్చ జోరుగా జరుగుతోంది.
Entertainment | Published On Sep 8, 2026, 6.10 pm IST
Priyanka Mohan | టాలీవుడ్, కోలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ప్రియాంక మోహన్. స్టార్ హీరోల సరసన వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆమె కెరీర్ కాస్త డల్‌గా సాగుతోందా? అంటే.. తాజాగా ఓ మూవీ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో ఇదే చర్చ జోరుగా జరుగుతోంది. గతంలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంక.. ఇప్పుడు వరుసగా మీడియం రేంజ్ చిత్రాలు ఎంచుకోవడంపై అభిమానులు స్పందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు భారీ చిత్రాల్లో నటించిన ప్రియాంక మోహన్.. కొంతకాలంగా పెద్ద సినిమాల్లో కనిపించడం తగ్గింది.
గతేడాది పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’లో హీరోయిన్‌గా కనిపించింది. అదే ఆమెకు చివరి బిగ్గెస్ట్ మూవీ రిలీజ్. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘మేడ్ ఇన్ కొరియా’లో నటించింది. అయితే ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు రావడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం హీరో కవిన్ నటిస్తున్న 9వ చిత్రం (వర్కింగ్ టైటిల్ ‘K09’)లో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మంజనత్తి’లోనూ భాగమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మరో కొత్త చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఏజీఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 29వ చిత్రంలో హీరో జై సరసన ప్రియాంక మోహన్ నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రియాంక అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘కే09’, ‘మంజనత్తి’ వంటి మంచి ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నప్పటికీ.. జై వంటి హీరోతో కలిసి నటించడం ఆమె కెరీర్ స్థాయికి తగ్గ ఎంపిక కాదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు అందుకున్న ప్రియాంక మోహన్.. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులను ఎందుకు ఎంచుకుంటోందంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఆమె క్రేజ్, టాలెంట్‌కు తగ్గట్టుగా మరిన్ని భారీ చిత్రాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే మరోవైపు.. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలతో తిరిగి సత్తా చాటే అవకాశం ఉందని, మంచి కథలు, పాత్రలు దొరికితే మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. శింబు హీరోగా తెరకెక్కుతున్న ‘అరసన్’లో ప్రియాంక మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి రాబోయే సినిమాలతో ప్రియాంక మోహన్ మళ్లీ ఫామ్‌లోకి వస్తుందా? గతంలో ఉన్న క్రేజ్‌ను తిరిగి అందుకుంటుందా? స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HMDA Clay Ganesha Distribution 2026 | పర్యావరణహితంగా వినాయక చవితి: ఉచితంగా మట్టి గణపతులు.. పంపిణీ కేంద్రాల వివరాలు ఇవే
- ●Ashika Ranganath | స్ట్రైప్స్ సారీలో ఆషికా రంగనాథ్.. అందంతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..!
- ●Harish Rao | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి
- ●Telangana Rice Exports | తెలంగాణ రైతుల పంట పండినట్లే! బియ్యం, విత్తనాల ఎగుమతులపై ఫిలిప్పీన్స్‌తో భారీ డీల్
- ●Bank Strike | బ్యాంకులకు 5 రోజుల పని విధానం కోసం సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె
- ●Samsung India | శాంసంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత.. 100 మందికి ఉద్వాసన..

HMDA Clay Ganesha Distribution 2026 | పర్యావరణహితంగా వినాయక చవితి: ఉచితంగా మట్టి గణపతులు.. పంపిణీ కేంద్రాల వివరాలు ఇవే

Ashika Ranganath | స్ట్రైప్స్ సారీలో ఆషికా రంగనాథ్.. అందంతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..!

Harish Rao | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి

Telangana Rice Exports | తెలంగాణ రైతుల పంట పండినట్లే! బియ్యం, విత్తనాల ఎగుమతులపై ఫిలిప్పీన్స్‌తో భారీ డీల్





