త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain | ఐటీ కారిడార్‌లో భారీ వ‌డ‌గ‌ళ్ల వాన‌..

Rain | హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న‌ట్టుండి మంగ‌ళ‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. అదేదో భారీ వ‌ర్షం కాదు.. వ‌డ‌గ‌ళ్లతో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. ఉద‌యం నుంచి ఎండ దంచికొట్టిన‌ప్ప‌టికీ.. సాయంత్రానికి ఆకాశం మేఘావృత‌మైంది.

S

Hyderabad | Published On Mar 24, 2026, 6.50 pm IST

Rain | ఐటీ కారిడార్‌లో భారీ వ‌డ‌గ‌ళ్ల వాన‌..
Advertisement

Rain | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న‌ట్టుండి మంగ‌ళ‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. అదేదో భారీ వ‌ర్షం కాదు.. వ‌డ‌గ‌ళ్లతో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. ఉద‌యం నుంచి ఎండ దంచికొట్టిన‌ప్ప‌టికీ.. సాయంత్రానికి ఆకాశం మేఘావృత‌మైంది. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ప‌లు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది.

ప్ర‌స్తుతం హైటెక్ సిటీ, నిజాంపేట్, కూక‌ట్‌ప‌ల్లి, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి, గ‌చ్చిబౌలి, మియాపూర్, గాజుల‌రామారం, బాలాన‌గ‌ర్, ఖైర‌తాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, అల్వాల్ వంటి ఏరియాల్లో వ‌డ‌గాళ్ల వ‌ర్షం కురుస్తోంది.

కొద్దిపాటి వ‌ర్షానికే ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌డంతో ఆయా కాల‌నీల వాసులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈదురుగాలుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన కురియ‌డంతో.. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది.

భారీ వ‌ర్షానికి న‌గ‌ర‌మంతా చ‌ల్ల‌బ‌డింది. ఉక్క‌పోత నుంచి న‌గ‌ర వాసుల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement