త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MCH to GHMC | ఎంసీహెచ్ టు జీహెచ్ఎంసీ.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ చ‌రిత్ర ఇదే..

MCH to GHMC | నాలుగు వందల ఏండ్ల చారిత్రక నగరం.. ఎన్నో విశేషాలు, మరెన్నో గొప్పగొప్ప ఆనవాళ్లు.. చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్న హైద‌రాబాద్ న‌గ‌రం రూపురేఖ‌లు 2026 ఫిబ్ర‌వ‌రి 11 నుంచి మారిపోయాయి.

S

Hyderabad | Published On Feb 11, 2026, 3.14 pm IST

MCH to GHMC | ఎంసీహెచ్ టు జీహెచ్ఎంసీ.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ చ‌రిత్ర ఇదే..
Advertisement

MCH to GHMC | త్రినేత్ర‌.న్యూస్ : నాలుగు వందల ఏండ్ల చారిత్రక నగరం.. ఎన్నో విశేషాలు, మరెన్నో గొప్పగొప్ప ఆనవాళ్లు.. చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్న హైద‌రాబాద్ న‌గ‌రం రూపురేఖ‌లు 2026 ఫిబ్ర‌వ‌రి 11 నుంచి మారిపోయాయి. ఎందుకంటే.. 2007 ఏప్రిల్ 16న న‌గ‌ర శివార్ల‌లోని 12 మున్సిపాలిటీల విలీనంతో 150 వార్డులుగా ఏర్పాటైన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌గా ఏర్పాటైంది. 300 వార్డుల‌కు విస్త‌రించి మ‌హా కార్పొరేష‌న్‌గా అవ‌త‌రించిన జీహెచ్ఎంసీ.. తిరిగి 150 వార్డుల‌తోనే కొత్త‌రూపు సంత‌రించుకుంది గ్రేట‌ర్ హైద‌రాబాద్. మొత్తంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం రూపురేఖ‌లు 2026 ఫిబ్ర‌వ‌రి 11 నుంచి మారిపోయాయి. దీంతో హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో ఒక అధ్యాయం ముగిసింది.

1955లో ఎంసీహెచ్ ఏర్పాటు

1955కు పూర్వం హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాలుగా ఉండేవి. ఈ రెండు మున్సిపాలిటీలు కూడా వేర్వేరు. అయితే 1955లో హైద‌రాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల‌ను విలీనం చేసి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ హైద‌రాబాద్‌ను ఏర్పాటు చేశారు. అనంత‌రం రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని ఉప్ప‌ల్, ఎల్‌బీన‌గ‌ర్, గ‌డ్డి అన్నారం, మ‌ల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్ మున్సిపాలిటీల‌ను, మెద‌క్ జిల్లా ప‌రిధిలోని పటాన్‌చెరు, రామ‌చంద్రాపురం మున్సిపాలిటీల‌తో పాటు ప‌లు గ్రామాల‌ను ఎంసీహెచ్‌లో విలీనం చేశారు.

జీహెచ్ఎంసీ పురుడు పోసుకుంది ఇలా..

అలా విలీనం చేసి 2007లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన విడుదలవగానే ఎంసీహెచ్( MCH )​ అధికారులు ఆయా మున్సిపాలిటీల్లోని ఇంజినీరింగ్​ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, చెక్కులు, ఆస్తి పన్ను దస్త్రాలు, ఇతర పత్రాలు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 2 నెలల పాటు ఆయా మున్సిపాలిటీల అధికారులే ఎప్పటిలాగే పౌరులకు సేవలు అందించారు. అప్పటివరకు ఎంసీహెచ్​ పరిధికి ఓ కమిషనర్​, 7 సర్కిళ్లకు ఏడుగురు ఉప కమిషనర్లు ఉండేవాళ్లు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను, 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా చేశారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటు చేశారు. తరువాత జోన్లు ఆరుకు, సర్కిళ్లు 30కి పెరిగాయి. అలా నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

గ‌తేడాది 27 స్థానిక సంస్థ‌లు జీహెచ్ఎంసీలో విలీనం..

2007లో ఏర్పాటైన జీహెచ్​ఎంసీలో గ‌తేడాది 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం అయ్యాయి. దీంతో న‌గ‌ర ప‌రిధి మ‌రింత విస్త‌రించింది. ప్ర‌స్తుత జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌ను విలీనం చేసిన‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ విలీన ప్ర‌క్రియ 2025 డిసెంబ‌ర్ 2వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు అధికారిక ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా పేర్కొంది. ఎట్ట‌కేల‌కు 2026 ఫిబ్ర‌వ‌రి 3న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీగా విభ‌జించారు.

Advertisement
Advertisement