Job Mela | యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం : మంత్రి శ్రీధర్‌బాబు
Job Mela | హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జాబ్ మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై వివిధ సంస్థల్లో ఎంపికైన అభ్యర్థులకు అప్పాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలు యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, అర్బన్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఈ జాబ్ మేళా యువతకు మంచి అవకాశమని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సరైన అవకాశాలు లభిస్తే ఎల్బీనగర్ ప్రాంత యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగినదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రైవేట్ రంగంలో పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా క్రమశిక్షణతో సిద్ధం కావాలని యువతకు సూచించారు. ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతను నిర్వర్తించే సాధనమని ఆయన పేర్కొన్నారు. ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






