Earth Hour | ఎర్త్ అవర్‌కు జీహెచ్ఎంసీ పిలుపు! రాత్రికి గంట పాటు లైట్లు ఆఫ్..!!
Earth Hour | పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం కూడా సిద్ధమవుతోంది.
Earth Hour | త్రినేత్ర.న్యూస్ : పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం కూడా సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎర్త్ అవర్ 2026 కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది. ఈ నెల 28న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని నగర పౌరులను కోరింది.
#GiveAnHourForEarth నినాదంతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా చిన్న చర్యలే పెద్ద మార్పులకు దారితీస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. పచ్చదనం పెంపు, పర్యావరణ హిత కార్యక్రమాల అమలు, నగర స్థిరమైన అభివృద్ధి దిశగా జీహెచ్ఎంసీ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ప్రతి చిన్న చర్యకు విలువ ఉంది. ధరిత్రి కోసం ఒక గంట కేటాయించడం ద్వారా గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టగలం అని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలు, సంస్థలు, విద్యాసంస్థలు ఈ గ్లోబల్ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





