త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్‌లో గ్యాస్ కోసం ఆటోల క్యూ.. రాత్రంతా డ్రైవ‌ర్ల‌ ప‌డిగాపులు

Hyderabad | హైదరాబాద్‌లో (Hyderabad) ఆటో గ్యాస్ కొర‌త డ్రైవ‌ర్ల‌ను వేధిస్తున్న‌ది. రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేష‌న్ల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు.

G

Hyderabad | Published On Mar 27, 2026, 1.25 pm IST

Hyderabad | హైద‌రాబాద్‌లో గ్యాస్ కోసం ఆటోల క్యూ.. రాత్రంతా డ్రైవ‌ర్ల‌ ప‌డిగాపులు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లో (Hyderabad) ఆటో గ్యాస్ కొర‌త డ్రైవ‌ర్ల‌ను వేధిస్తున్న‌ది. రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేష‌న్ల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. వనస్థలిపురం పరిధి ఆటోనగర్‌లోని (Auto Nagar) ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద గ్యాస్ కోసం ఆటోలు క్యూకట్టాయి. ఎల్పీజీ కోసం క్యూక‌ట్టాయి. గురువారం సాయంత్రం నుంచి ఆటోలను డ్రైవర్లు వరుసలో పెట్టి పడిగాపులు కాస్తున్నారు.

ఆటో నగర్‌ కూడలి నుంచి సుష్మా సాయినగర్‌ కాలనీ మీదుగా హుడా సాయినగర్‌ వరకు పెద్ద ఎత్తున ఆటోలు బారులుతీరాయి. చాలా మంది డ్రైవర్లు రాత్రంతా ఆటోల వద్దే గడుపుతూ తమ వంతు కోసం వేచిచూశారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం కూడా ఆటోలు లైన్లలోనే ఉన్నాయి. పెట్రోల్‌, ఎల్పీజీ దొరకదనే ప్రచారంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement