త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganja | హైద‌రాబాద్‌లో 1.74 కిలోల గంజాయి స్వాధీనం

Ganja | మ‌త్తు ప‌దార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న‌ప్ప‌టికీ.. విచ్చ‌ల‌విడిగా విక్ర‌యాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా అత్తాపూర్ ప‌రిధిలో 1.74 కిలోల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Mar 12, 2026, 4.45 pm IST

Ganja | హైద‌రాబాద్‌లో 1.74 కిలోల గంజాయి స్వాధీనం
Advertisement

Ganja | త్రినేత్ర‌.న్యూస్ : మ‌త్తు ప‌దార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న‌ప్ప‌టికీ.. విచ్చ‌ల‌విడిగా విక్ర‌యాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా అత్తాపూర్ ప‌రిధిలో 1.74 కిలోల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్ర‌యిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. వారిద్ద‌రిని షేక్ సోహెబ్‌(22), మ‌హ‌మ్మ‌ద్ న‌దీం(19)గా పోలీసులు గుర్తించారు. సోహెబ్ ట్ర‌క్కు డ్రైవ‌ర్‌గా, న‌దీం పెయింట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. వీరిద్ద‌రిది కూడా మ‌హారాష్ట్ర‌లోని అకోలా గ్రామం.

అల్తు, లాలా, అర్స‌లాన్, యూసుఫ్, అమ‌ర్, సోహైల్, షేరా నుంచి కొనుగోలు చేశామ‌ని, వీరంతా హైద‌రాబాద్‌లో గంజాయి విక్ర‌యిస్తున్నార‌ని తెలిపారు. ఈ కేసులో సోహెబ్, నదీంను పోలీసులు కోర్టులో ప్ర‌వేశ‌పెట్టి రిమాండ్‌కు త‌ర‌లించారు. మిగ‌తా వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.

Advertisement
Advertisement