Gadwal Vijayalakshmi Cabinet Meeting | సచివాలయంలో కేబినెట్ హాల్లోకి గద్వాల విజయలక్ష్మికి నో ఎంట్రీ.. సీఎంవో అధికారుల సమాధానంతో షాక్
సచివాలయంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మికి ఊహించని షాక్! సాంప్రదాయానికి భిన్నంగా కాబినెట్ భేటీకి అనుమతి నిరాకరణ.. సీఎంవోలో ఏం జరిగింది?
- తెలంగాణ కేబినెట్ సమావేశానికి వెళ్లిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మికి ప్రవేశం నిరాకరణ
- గతంలో కేసీఆర్ హయాంలో ఈ పదవిలో ఉన్నవారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచే సంప్రదాయం
- ఆహ్వానం లేదంటూ అధికారులు అడ్డుకోవడంతో సీఎంఓను సంప్రదించిన విజయలక్ష్మి
- సీఎంఓ వర్గాల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిరాశగా వెనుదిరిగిన వైనం
Gadwal Vijayalakshmi Cabinet Meeting | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ సచివాలయంలో ఆసక్తికర, అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళికా మండలి (ప్లానింగ్ బోర్డు) వైస్ చైర్మన్ హోదాలో ఉన్న గద్వాల విజయలక్ష్మికి కాబినెట్ భేటీలో ఊహించని అవమానం ఎదురైంది. మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమెను అధికారులు లోపలికి అనుమతించకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాంప్రదాయానికి భిన్నంగా అడ్డుకున్న అధికారులు
తెలంగాణలో గత కొన్నేళ్లుగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించే వారిని కేబినెట్ సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించే ఆనవాయితీ కొనసాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిరంజన్ రెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్‌లు ఈ పదవిలో ఉన్నప్పుడు ప్రతి కేబినెట్ సమావేశానికి హాజరయ్యేవారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు బాధ్యతల్లో ఉన్నంత కాలం ఆయనను కేబినెట్ సమావేశాలకు ఆహ్వానించారు.
అయితే, ఇటీవల గద్వాల విజయలక్ష్మి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమితులైన తర్వాత మొదటిసారి జరుగుతున్న సమావేశంలో ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది.
సమావేశ మందిరం వద్ద ఏం జరిగింది?
నిర్ణీత సమయానికి సచివాలయానికి చేరుకున్న విజయలక్ష్మి, కేబినెట్ సమావేశ మందిరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న భద్రతా, ప్రోటోకాల్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం లేదని, లోపలికి అనుమతించే జాబితాలో ఆమె పేరు లేదని స్పష్టం చేశారు.
సీఎంవోకు వెళ్లినా నిరాశే
ఈ సమాధానంతో తీవ్ర అసంతృప్తికి గురైన విజయలక్ష్మి.. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) వెళ్లి అక్కడి ఉన్నతాధికారులను సంప్రదించారు. కాబినెట్‌కు తనను ఆహ్వానించకపోవడంపై ఆరా తీశారు. అయితే సీఎంవో అధికారులు కూడా దీనిపై తమ వద్ద ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆమె అక్కడి నుంచి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ హోదా కలిగిన వ్యక్తికి కేబినెట్ సమావేశంలో ప్రవేశం లభించకపోవడం, కనీసం ఆహ్వానం కూడా పంపకపోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా లేక ప్రోటోకాల్ సమన్వయ లోపమా అన్నది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●One Nation One Election JPC | 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్
- ●Kalady Sri Adi Shankaracharya Math | అద్వైత సంగమం కార్యక్రమానికి రండి
- ●Pakistani Cosmetics Seized Hyderabad | అందం పేరుతో విషం: రూ. 7 లక్షల విలువైన నిషేధిత పాకిస్థానీ కాస్మొటిక్స్ సీజ్
- ●Chamala Kirankumar Reddy | అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే హోటల్ పెట్టలేకపోయారు.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి 3 స్టార్ హోటల్స్ కొన్నారా?
- ●Khairatabad By Election Update | ఖైరతాబాద్ ఉప ఎన్నికపై ఈసీఐ కీలక నిర్ణయం.. హైకోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ
- ●Physiotherapists Jobs | జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..

One Nation One Election JPC | 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్

Kalady Sri Adi Shankaracharya Math | అద్వైత సంగమం కార్యక్రమానికి రండి

Pakistani Cosmetics Seized Hyderabad | అందం పేరుతో విషం: రూ. 7 లక్షల విలువైన నిషేధిత పాకిస్థానీ కాస్మొటిక్స్ సీజ్

Chamala Kirankumar Reddy | అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే హోటల్ పెట్టలేకపోయారు.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి 3 స్టార్ హోటల్స్ కొన్నారా?






