త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalady Sri Adi Shankaracharya Math | అద్వైత సంగమం కార్య‌క్ర‌మానికి రండి

వ‌చ్చే డిసెంబ‌ర్ 12న సికింద్రాబాద్‌ ప‌రేడ్ గ్రౌండ్‌ స‌మీపంలో ఉన్న బైస‌న్ పోలో మైదానంలో నిర్వ‌హించే అద్వైత సంగమం కార్య‌క్ర‌మానికి రావాల‌ని కేటీఆర్‌ను ఆహ్వానించిన‌ట్లు ఆదిశంకరాచార్య మడొమ్ ఛైర్మన్ రితీష్ రాజ్, ఉన్నీకృష్ణన్ నంబూద్రి తెలిపారు.

S

Hyderabad | Published On Oct 1, 2026, 7.28 pm IST

Kalady Sri Adi Shankaracharya Math | అద్వైత సంగమం కార్య‌క్ర‌మానికి రండి
Advertisement
  • కేటీఆర్‌ను ఆహ్వానించిన ఆదిశంకరాచార్య మడొమ్ ఛైర్మన్ రితీష్ రాజ్, ఉన్నికృష్ణ‌న్ నంబూద్రి

త్రినేత్ర న్యూస్: వ‌చ్చే డిసెంబ‌ర్ 12న సికింద్రాబాద్‌ ప‌రేడ్ గ్రౌండ్‌ స‌మీపంలో ఉన్న బైస‌న్ పోలో మైదానంలో నిర్వ‌హించే అద్వైత సంగమం కార్య‌క్ర‌మానికి రావాల‌ని కేటీఆర్‌ను ఆహ్వానించిన‌ట్లు ఆదిశంకరాచార్య మడొమ్ ఛైర్మన్ రితీష్ రాజ్, ఉన్నీకృష్ణన్ నంబూద్రి తెలిపారు. ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం కేటీఆర్ ను కలిసి ఆహ్వానించిన‌ట్లు పేర్కొన్నారు. కలాడి శ్రీ ఆదిశంకరాచార్య మడొమ్ ఆధ్వర్యంలో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

అద్వైత సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, ఆ రోజు ఉదయం గణపతి హోమంతో మొదలై శంకర-శాస్తపూజ, భజన, కోటి కుంకుమార్చన, అతిథితులకు సన్మానం, సాయంత్రం మంగళ హారతితో కార్యక్రమం ముగుస్తుందని నంబూద్రి తెలిపారు. కేటీఆర్‌ను క‌లిసిన వారిలో సందీప్ నల్లూరి, కూసం శ్రీనివాస్, దుర్గారాజు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement