Hyderabadi Haleem | హైదరాబాద్ హలీంకు కొత్త నిబంధనలు.. ఫసాయ్ కీలక ఆదేశాలు..
Hyderabadi Haleem | హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హలీం తయారీలో ఇకపై కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. సంప్రదాయ వంటకంగా పేరొందిన హైదరాబాద్ హలీంకు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం, “హలీం” పేరుతో విక్రయించే ఉత్పత్తిలో కనీసం 25 శాతం మాంసం ఉండాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ గోధుమ రవ్వ, పప్పులు కలిపి తయారు చేసే హలీం సెంటర్లపై ఈ నిబంధనలు ప్రభావం చూపనున్నాయి. అంతేకాకుండా హలీంలో ప్రోటీన్, తేమ (మాయిశ్చర్), కొవ్వు (ఫ్యాట్) శాతాలకు కూడా ప్రత్యేక ప్రమాణాలు నిర్ణయించారు. మటన్ హలీంలో కనీసం 8 శాతం ప్రోటీన్ ఉండాలి.
తేమ శాతం 70 దాటకూడదు. చికెన్ హలీంలో కనీసం 6 శాతం ప్రోటీన్ ఉండాలని, తేమ 75 శాతం లోపే ఉండాలని, అన్ని రకాల హలీంలలో కొవ్వు శాతం గరిష్ఠంగా 12 శాతం మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. హలీం నాణ్యతను పరీక్షించే సమయంలో ఈ ప్రమాణాలనే ప్రయోగశాలల్లో ఆధారంగా తీసుకోనున్నారు. దీంతో ప్యాకెట్లలో విక్రయించే, విదేశాలకు ఎగుమతి చేసే హలీంపై మరింత పర్యవేక్షణ ఉండనుంది. ఈ నిబంధనలను 2025 జూలైలో గెజిట్ ద్వారా ప్రకటించినప్పటికీ.. అమలులో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన హలీం తయారీదారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, అమెరికాకు టిన్ ప్యాకెట్లలో హలీం ఎగుమతి చేసే సంస్థలు, సంప్రదాయంగా గంటల తరబడి ఉడికించే విధానంలో తేమ శాతాన్ని ఒకే స్థాయిలో ఉంచడం కష్టమవుతోందని పేర్కొన్నారు.
తయారీదారుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.. కొత్త నిబంధనల అమలుకు గడువును 2026 నవంబర్ 1 వరకు పొడిగించింది. అంటే ప్రస్తుత 2026 హలీం సీజన్‌కు కొంత వెసులుబాటు లభించినట్టే. అయితే వచ్చే రంజాన్ నాటికి అన్ని వాణిజ్య హలీం తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై ప్రోటీన్, కొవ్వు శాతం వివరాలను తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. ఇకపై “మీట్ హలీం” అనే సాధారణ పేర్లకు బదులుగా, మటన్ హలీం, మేక మాంసం హలీం, బఫెలో మీట్ హలీం అని స్పష్టంగా పేర్కొనాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వినియోగదారులకు హలీం నాణ్యత, మాంసం గురించి స్పష్టమైన సమాచారం తెలియనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






