త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Payal Mehta | సీఎన్ఎన్ – న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిట‌ర్ పాయ‌ల్ మెహ‌తా క‌న్నుమూత‌

Payal Mehta | సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సీఎన్ఎన్ - న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిట‌ర్ పాయ‌ల్ మెహ‌తా(46) ఇక లేరు. శ‌నివారం రాత్రి ఆమె తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో.. చికిత్స నిమిత్తం ముంబైలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

S

National | Published On Sep 20, 2026, 10.54 am IST

Payal Mehta | సీఎన్ఎన్ – న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిట‌ర్ పాయ‌ల్ మెహ‌తా క‌న్నుమూత‌
Advertisement

Payal Mehta | త్రినేత్ర‌.న్యూస్ : సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సీఎన్ఎన్ - న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిట‌ర్ పాయ‌ల్ మెహ‌తా(46) ఇక లేరు. శ‌నివారం రాత్రి ఆమె తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో.. చికిత్స నిమిత్తం ముంబైలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. ఆమె మృతికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

పాయ‌ల్ మెహ‌తా మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు జేపీ న‌డ్డా, కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు.

ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే జ‌ర్న‌లిస్ట్

పాయ‌ల్ మెహ‌తా మృతి బాధాక‌రం. ఆమె ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే జ‌ర్న‌లిస్ట్. క్షేత్ర స్థాయిలో ఆమె ప‌ర్య‌టిస్తూ.. జాతీయ స‌మ‌స్య‌ల‌పై లోతైన అవ‌గాహ‌న‌తో రిపోర్టింగ్ చేసేవారు. ప్ర‌జ‌ల‌తో ఆమె ఎంతో ద‌య‌గా మెలిగేవార‌ని మోదీ పేర్కొన్నారు.

పార్ల‌మెంట్ బీట్‌పై ఆమెకు ఎంతో నిబ‌ద్ధ‌త‌

పార్ల‌మెంట్ బీట్‌పై పాయ‌ల్ మెహ‌తాకు ఎంతో నిబ‌ద్ధ‌త ఉండేది. పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో ఆమె తెల్ల‌వారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు పార్ల‌మెంట్‌లోనే ఉండి, స‌భా కార్య‌క‌లాపాల‌ను నిశితంగా ప‌రిశీలించేవార‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్‌గా ప్ర‌సిద్ధి

జ‌ర్న‌లిజం వృత్తిని పాయ‌ల్ మెహ‌తా 2008లో ప్రారంభించారు. మొద‌ట స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్టుగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత పొలిటిక‌ల్ రిపోర్టర్‌గా మారారు. ఫోక‌స్ టీవీ, న్యూస్ఎక్స్, రిప‌బ్లిక్ టీవీ, ఏషియ‌న్ న్యూస్ ఇంట‌ర్నేష‌న‌ల్, సీఎన్ఎన్ - న్యూస్ 18 వంటి సంస్థ‌ల్లో ఆమె ప‌ని చేశారు. సీఎన్ఎన్ - న్యూస్ 18లో ప్ర‌ధానంగా పార్ల‌మెంట్‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో పాటు పొలిటిక‌ల్ పార్టీల న్యూస్‌ను క‌వ‌ర్ చేసేవారు.

Advertisement
Advertisement