Seethakka | ఎములాడ రాజన్న, సమ్మక్క సారలమ్మ ఆలయాల అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్: మంత్రి సీతక్క
Seethakka | వేములవాడ రాజన్న, సమ్మక్క సారలమ్మ ఆలయాలను మాజీ సీఎం కేసీఆర్ (KCR) పట్టించుకోలేదని మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాధారణ భక్తుల మనోభావాలను గుర్తిస్తున్నారని తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: వేములవాడ రాజన్న, సమ్మక్క సారలమ్మ ఆలయాలను మాజీ సీఎం కేసీఆర్ (KCR) పట్టించుకోలేదని మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాధారణ భక్తుల మనోభావాలను గుర్తిస్తున్నారని, ఇందులో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి, సమ్మక్క గుళ్లను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం కుటుంబ సమేతంగా రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణంను గొప్పగా చేస్తున్నారని తెలిపారు. సమ్మక్క జాతర నేపథ్యంలో ముందుగా వేములవాడలో స్వామి వారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నానని వెల్లడించారు.
వేములవాడ రాజన్న, సమ్మక్క సారలమ్మను ఎక్కువగా పేద ప్రజలు దర్శించుకుంటారని.. కానీ ఇటీవల ఉన్నత వర్గాల వారు కూడా వస్తున్నారన్నారని చెప్పారు. నాలుగు రోజుల పాటు మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ భక్తుల మనోభావాలను గుర్తిస్తున్నారని చెప్పారు.
గతంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయవద్దని దుష్ప్రచారాలు చేశారని.. కానీ భక్తుల మనోభావాలను గుర్తించి సీఎం రేవంత్ గుడిని డెవలప్ చేస్తున్నారని తెలిపారు. వేములవాడలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఆలయాల అభివృద్ధి భావోద్వేగాలు, ఆచారాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఈ నెల 18న మేడారంలో కేబినెట్ మీటింగ్ జరుగుతుందని వెల్లడించారు. 19న సమ్మక్క సారలమ్మ గుడిని సీఎం పునః ప్రారంభింస్తారని తెలిపారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



