త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్ నాంప‌ల్లిలో ఘోర అగ్నిప్ర‌మాదం..

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలోని నాంప‌ల్లిలో ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ఫ‌ర్నిచ‌ర్ షాపులో మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌లు పైనున్న అంత‌స్తుల‌కు వ్యాపించాయి.

S

Hyderabad | Published On Jan 24, 2026, 2.37 pm IST

Hyderabad | హైద‌రాబాద్ నాంప‌ల్లిలో ఘోర అగ్నిప్ర‌మాదం..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని ఓ ఫ‌ర్నీచ‌ర్ దుకాణంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. బ‌చ్చా క్రిస్ట‌ల్ ఫ‌ర్నిచ‌ర్ ఫాపులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌లు పైనున్న అంత‌స్తుల‌కు వ్యాపించాయి. మొత్తం నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం అగ్నికీల‌ల్లో చిక్కుకుంది. భ‌వ‌నంలో ఆరుగురు ఉన్నార‌ని స్థానికులు వెల్ల‌డించారు. వారిలో త‌ల్లి, ఇద్ద‌రు పిల్లలు ఉన్న‌ట్లు తెలిపారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంట‌ల‌ను నాలుగు ఫైరింజ‌న్లు అదుపు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సిప‌డ‌టంతోపాటు ద‌ట్టంగా పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. భ‌వ‌నం ప‌రిస‌ర ప్రాంతవాసుల‌ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఘ‌ట‌నా స్థ‌లంలో అంబులెన్సుల‌ను అధికారులు సిద్ధంగా ఉంచారు.

 

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement