త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. వాహ‌నాల‌కు అంటుకున్న మంట‌లు

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో మ‌రోసారి అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మియాపూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హ‌ఫీజ్‌పేట - మార్తాండ‌న‌గ‌ర్ కాల‌నీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ద‌గ్ధ‌మైంది.

S

Hyderabad | Published On Mar 31, 2026, 7.10 am IST

Hyderabad | పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. వాహ‌నాల‌కు అంటుకున్న మంట‌లు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో మ‌రోసారి అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మియాపూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హ‌ఫీజ్‌పేట - మార్తాండ‌న‌గ‌ర్ కాల‌నీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ద‌గ్ధ‌మైంది. భారీ శ‌బ్దంతో ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలడంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. త‌క్ష‌ణ‌మే అగ్నిమాప‌క సిబ్బందికి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ప‌క్క‌నే ఉన్న టాటా ఏస్ వాహ‌నం, రెండు బైకుల‌కు మంట‌లు అంటుకున్నాయి. దీంతో అవి పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. హెవీ లోడ్ కార‌ణంగానే ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలిపోయిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది.

Advertisement

తాజావార్తలు

Advertisement