త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Japan Vs Sweden | డ్రాగా ముగిసినా.. నాకౌట్‌కు జపాన్‌, స్వీడన్‌

Japan Vs Sweden | ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-ఎఫ్‌లో జపాన్, స్వీడన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో రెండు జట్లు నాకౌట్ దశ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హత సాధించాయి. జపాన్ తరఫున డైజెన్ మెయెడా గోల్ చేయగా, కొద్ది నిమిషాలకే ఆంథోనీ ఎలంగా గోల్‌ చేసి స్కోర్‌ను సమం చేశాడు. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్ కోసం పోటాపోటీగా ప్రయత్నించినా చివరకు మ్యాచ్‌ డ్రా ముగిసింది.

P

Sports | Published On Jun 26, 2026, 4.21 pm IST

Japan Vs Sweden | డ్రాగా ముగిసినా.. నాకౌట్‌కు జపాన్‌, స్వీడన్‌
Advertisement
  • 1-1 తేడాతో మ్యాచ్‌ డ్రా
  • రౌండ్‌ ఆఫ్‌ 32లో బ్రెజిల్‌తో పోరు

Japan Vs Sweden | ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-ఎఫ్‌లో జపాన్, స్వీడన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో రెండు జట్లు నాకౌట్ దశ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హత సాధించాయి. జపాన్ తరఫున డైజెన్ మెయెడా గోల్ చేయగా, కొద్ది నిమిషాలకే ఆంథోనీ ఎలంగా గోల్‌ చేసి స్కోర్‌ను సమం చేశాడు. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్ కోసం పోటాపోటీగా ప్రయత్నించినా చివరకు మ్యాచ్‌ డ్రా ముగిసింది. మ్యాచ్‌ ద్వితీయార్థం 56వ నిమిషంలో రిట్సు డోయాన్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను డైజెన్ మెయెడా అందుకుని గోల్‌గా మలిచాడు. పెనాల్టీ బాక్స్‌లో బంతిని చక్కగా నియంత్రించిన మెయెడా, స్వీడన్ గోల్‌కీపర్ జాకబ్ విడెల్ జెట్టర్‌స్ట్రోమ్‌ను ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జపాన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే, ఆ ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు. కేవలం ఆరు నిమిషాల తర్వాత ఆంథోనీ ఎలంగా బాక్స్ వెలుపల నుంచి ఎడమ కాలితో అద్భుతమైన షాట్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఈ టోర్నీలో ఎలంగా చేసిన రెండో గోల్ ఇదే.

జపాన్‌ కొత్త రికార్డు

ఈ మ్యాచ్‌లో మెయెడా చేసిన గోల్‌తో ప్రపంచకప్‌లో జపాన్ గోల్స్ సంఖ్య ఏడుకు చేరింది. ఒకే ప్రపంచకప్‌లో జపాన్ సాధించిన అత్యధిక గోల్స్ ఇవే. 2018 రష్యా ప్రపంచకప్‌లో ఆ జట్టు చేసిన ఆరు గోల్స్ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది. అలాగే, వరుసగా మూడో ప్రపంచకప్‌లో జపాన్ గ్రూప్ దశను దాటడం విశేషం. మొత్తం మీద ఏడుసార్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జపాన్ ఐదోసారి నాకౌట్ దశలోకి ప్రవేశించింది. గ్రూప్-ఎఫ్‌లో నెదర్లాండ్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన జపాన్, సోమవారం హ్యూస్టన్‌లో బ్రెజిల్‌తో జరిగే రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో తలపడనుంది. మ్యాచ్‌ తర్వాత జపాన్‌ కోచ్‌ మాట్లాడుతూ.. బ్రెజిల్ వంటి అగ్రశ్రేణి జట్టుతో ఆడడం మాకు గొప్ప అనుభవం. వారిని ఓడించే అవకాశం మాకూ ఉందనే నమ్మకం ఉంది. మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నాం’ అని హజిమే మోరియాసు తెలిపారు.

స్వీడన్‌కూ నాకౌట్ టికెట్

1994 ప్రపంచకప్ నుంచి అర్హత సాధించిన ప్రతిసారీ నాకౌట్ దశకు చేరుతున్న స్వీడన్ ఆ సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించింది. రౌండ్ ఆఫ్ 32లో ప్రత్యర్థి ఎవరో మాత్రం ఇంకా తేలలేదు. మ్యాచ్‌ అదనపు సమయంలో స్వీడన్ విజయానికి దగ్గరగా వచ్చింది. ఎలంగా మరోసారి చేసిన ప్రమాదకర షాట్‌ను జపాన్ గోల్‌కీపర్ జియాన్ సుజుకి అద్భుతంగా అడ్డుకున్నాడు. వెంటనే వచ్చిన కార్నర్‌లో అలెగ్జాండర్ ఇసాక్ చేసిన హెడ్డర్‌ను కూడా సుజుకి క్రాస్‌బార్ వైపు మళ్లించి ప్రమాదాన్ని తప్పించాడు. అనంతరం ఆటగాళ్ల మధ్య ఎగిరి బంతిని అందుకుని జపాన్‌కు కీలకమైన డ్రాను కాపాడాడు. మ్యాచ్‌లో స్వీడన్‌కు ఎనిమిది కార్నర్లు లభించగా.. జపాన్‌కు కేవలం రెండు మాత్రమే దక్కాయి. అయినా కీలక సమయంలో అవకాశాలను సద్వినియోగం చేసుకున్న జపాన్ డ్రాతోనే నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. స్వీడన్ కూడా ఒక్క పాయింట్‌తో తదుపరి దశలో అడుగుపెట్టింది.

Advertisement
Advertisement